రాజకీయ పార్టీలకు సొంత పత్రికలు ఉన్నాయి: వెంకయ్యనాయుడు

 రాజకీయ పార్టీలకు సొంత పత్రికలు ఉన్నాయి: వెంకయ్యనాయుడుఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వార్తా పత్రికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పత్రిక లేని ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని చూడలేమని వెంకయ్య నాయుడు అన్నారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు సొంత పత్రికలు పెట్టుకుంటున్నాయన్నారు. కొన్ని పార్టీలు సొంత పత్రికలో సొంత బాకా ఊదుకుంటున్నాయని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఒక పత్రికలో ఉన్నది మరో పత్రికలో ఉండదని, సమాజానికి హాని చేసే పత్రికలు వద్దంటూ ఆయన హితవు పలికారు.ఇప్పుడు కొన్ని పత్రికలు సెన్సేషన్‌ కాదు.. సెన్స్‌ లెస్‌ గా మారాయి అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వివాదాలే.. వాదాలు అవుతున్నాయని, నేను మనస్సులో ఉన్న మాట మాట్లాడుతాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మాతృభాష కళ్ల లాంటిది.. పరాయి బాష కళ్లజోడు లాంటిదని ఆయన అన్నారు.