శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము,
ఇంద్రకీలాద్రి,విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు అనగా ది.02-03-2022 న సా.04 గం.లకు శ్రీ స్వామి వారు అమ్మవార్లు రధోత్సవం కొరకు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారి పర్యవేక్షణలో ఆలయ స్థానాచార్యులు మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము నుండి మేళతాలములతో పల్లకీ పై ఊరేగింపుగా బయలుదేరి కనకదుర్గానగర్ ద్వారా పాత శివాలయం చేరుకొనగా, పాత శివాలయం ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పాత శివాలయం వద్ద పూజలు నిర్వహించి, శ్రీ స్వామి అమ్మవార్లు రధం సెంటరుకు చేరుకొనడం జరిగినది.
అనంతరం శ్రీ అమ్మవార్లు స్వామి వారి ఉత్సవమూర్తులకు రధోత్సవం నిర్వహించడం జరిగినది. అనంతరం ఉత్సవమూర్తులు కనకదుర్గానగర్ మీదుగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయమునకు చేరడం జరిగినది.
ఈ రధోత్సవం కార్యక్రమం నందు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు , నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి , నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతిరాణా టాటా, IPS , ఆలయ అధికారులు మరియు సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పాల్గొన్నారు.
addComments
Post a Comment