దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్*


అమరావతి (ప్రజా అమరావతి);


నేడు (23-03-2022)  ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను  ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్.


దిశ పెట్రోలింగ్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత చేరువ కావడానికి మరియు మహిళలకు పటిష్టమైన భద్రతను కల్పించడంలో భాగంగా క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం కోసం  విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగుపరచడం కోసం ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్‌ ను  ప్రారంభించింది.


అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు (స్కూటర్లు) మహిళల రక్షణ కోసం  పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. మహిళలు మరియు పిల్లలకు మరింత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు పెట్రోలింగ్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు అవసరమైన సహాయం, రక్షణను అందించడమే కాకుండా వారిపైన జరిగే నేరాలను నిరోధించడంలో ఈ పెట్రోలింగ్ వాహనాలు సమర్థవంతంగా ఉపయోగించబడుతున్నాయి.


మహిళాల రక్షణ కై తీసుకుంటున్న ఈ లక్ష్యాన్ని పెంపొందించే విధంగా, ప్రతి పోలీస్ స్టేషన్‌ పరిధిలో నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలను గుర్తించడంతోపాటు గతంలో జరిగిన నేరానికి సంబందించిన వివరాలు, సమయం, ప్రాంతం వంటి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేస్తూ, ఆ సమాచారాన్ని దిశ పెట్రోలింగ్ వాహనాలను అనుసంధానించడం జరుగుతుంది.


ఈ గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్న  పోలీస్ శాఖ 163 ఫోర్ వీలర్ వాహనాలను కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధం చేసింది. ఈ వాహనాలన్ని  జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుండి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగా ప్రత్యేక GPS ట్రాకింగ్ వ్యవస్థతో కూడి  ఉంటుంది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడానికి ఈ పెట్రోలింగ్ వాహనాలు జనసంచారం తక్కువ ఉన్న  సమస్యాత్మక ప్రాంతాలలో నేరం జరిగేందుకు అవకాశం ఉన్న అన్ని  ప్రదేశాలలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయి.


ప్రస్తుతం ఉన్న 900 ద్విచక్ర వాహనాలు, 163 ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్ వాహనాలతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సత్వర ప్రతిస్పందన కోసం 3,000కు పైగా ఎమర్జెన్సీ వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 పోలీస్ యూనిట్లలో ఏర్పాటు చేసిన దిశ కంట్రోల్ రూంతో పాటు పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూం కి అనుసంధానించడం జరిగింది. దీని ద్వారా మహిళలు తమ మొబైల్ ఫోన్ లో దిశ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా అనంతరం ఏదైనా సమస్యను ఉత్పన్నమైనప్పుడు తమ చేతిలోని SOS లేదా మొబైల్ ను షేక్ చేయడం ద్వారా భాదితుల వద్దకు చేరుకునే  పోలీసులు సమయం  పట్టణ ప్రాంతాల్లో ప్రతిస్పందన సమయం 4-5 నిమిషాలు అదే గ్రామీణ ప్రాంతాల్లో 8-10 నిమిషాలకు తగ్గింది. ఈ ప్రతిస్పందన సమయం మరింత తక్కువగా ఉండడానికి ఈ ప్రత్యేక వాహనాలు తోడ్పడతాయి. ఇప్పటికే దిశ మొబైల్ అప్లికేషన్ ను కోటి పదహారు లక్షల(1.16) మంది  మహిళలు తమ మొబైల్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవడం మన అందరికి తెలిసిందే.


*మహిళా సిబ్బంది కి ప్రత్యేకంగా దిశ మొబైల్ విశ్రాంతి గదులు*


మహిళా సాధికారతలో భాగంగా పెద్ద సంఖ్యలో మహిళలు పోలీసు శాఖలో చేరుతున్నారు, వివిధ సంధార్భాలలో ప్రముఖుల సమావేశాలు, బందోబస్తులతో తోపాటు ఇతర అనేక  కార్యక్రమాల కోసం మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు, ఈ పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా Washrooms లను  అందుబాటులో లేకపోవడంతో విధులు నిర్వహిస్తున్న ప్రదేశంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం, పోలీస్ శాఖ   క్షేత్ర స్థాయి విధుల్లో ఉన్న మహిళా పోలీసుల ప్రాథమిక సౌకర్యాలకు కల్పనలో భాగంగా 30 మొబైల్ రెస్ట్ రూంలను ప్రత్యేకంగా రూపొందించి 18 మొబైల్ రెస్ట్ రూంలను అందుబాటులోకి తీసుకువచ్చింది.


*మొబైల్ రెస్ట్ రూం ప్రత్యేకతలు*


మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక రూం, విలువైన వస్తువులను భద్రపరుచుకునేందుకు 9 లాకర్లు, 3 మొబైల్ ఛార్జింగ్ పాయింట్


3 ఆధునిక washrooms  


1 షవర్ రూం 


3 KV ఫిట్టెడ్ పవర్ జనరేటర్


1.5 kv ఫిట్టెడ్ ఇన్వర్టర్ 


External Power Connectivity 


800 లీటర్ల మంచి నీటి ట్యాంక్ 


800 లీటర్ల మురుగు నీటి ట్యాంక్ 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత మరియు సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇందులో భాగంగా, దిశ పెట్రోలింగ్ ఫోర్ వీలర్ల 163 వాహనాల కు రూ.13.85 కోట్లతో కొనుగోలు చేయడానికి నిధులను కేటాయించబడింది.అంతేకాకుండా 30 మొబైల్ రెస్ట్ రూంలను సేకరించేందుకు రూ. 5.5 కోట్లు ఇప్పటికే కేటాయించింది.

Comments
Popular posts
దొంగతనం కేసును చేదించి ముద్దాయిలను పట్టుకున్న రూరల్ సీఐ,. ఎస్ఐ
Image
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా వుంటూ, ఆధునిక సాంకేతిక పద్దతులు, పరిశోధనలు రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది.
Image
Gudivada - Kankipadu road widening, development works start
Image
*ఊర పంది మాంసం ను, అడవి జంతువుల మాంసంగా నమ్మిస్తూ అమ్ముతున్న ముఠా అరెస్ట్* గోదావరిఖని : కొంత కాలంగా కొందరు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఊర పంది మాంసంను అడవిలో తిరిగే జింక, దుప్పి, అడవి పంది మాంసంగా నమ్మిస్తూ, జింక, దుప్పి, అడవి పంది లను వెటాడి చంపినట్లుగా ఫోటోలను వాట్సాప్ లో ఫోటోలు పెడుతూ ప్రజలను నమ్మించి, అదిక ధరలకు అమ్ముతూ పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న వారిని గుర్తించి, వారిపైన నిఘా పెట్టి ఈరోజు శాంతినగర్, పెద్దపల్లి లో ఊర పంది మాంసంను అడవి జంతువుల మాంసంగా నమ్మిస్తూ అమ్ముతుండగా, *1) లోకిని అంజయ్య S/o ఎల్లయ్య, 37 సం, ఎరుకల r/o హన్మంతునిపేట్,* *2) రేవెల్లి సంపత్ S/o పీసరయ్య, 32 సం, ఎరుకల r/o వద్కాపూర్* అను ఇద్దరినిఅరెస్ట్ చేయడం జరిగినది. *ఇంకా వీరి ముఠా సభ్యులు అయిన* *1) లోకిని జంపయ్య r/o హన్మంతునిపేట్,* *2) లోకిని గణేష్ r/o హన్మంతునిపేట్,* *3) లోకిని అనిల్ r/o నిమ్మనపల్లి,* *4) రేవెల్లి శివాజీ r/o వడ్కపూర్,* *5) కుర్ర తిరుపతి r/o పెద్దకాల్వల* *6) కెదిరి తిరుపతి r/o పెద్దపల్లి* పరారిలో వున్నారు. వీరివద్దనుండి *1) 20 కిలోల ఊర పంది మాంసం* *2) 4 కత్తులు,* *3) మటన్ కొట్టె మొద్దుకర్ర* *4) తరాజు, బాట్లు* *5) AP-15-P-120 హీరో హోండా ప్యాషన్ మోటర్ సైకిల్ స్వాదీనం చేసుకోనైనది.* ఇట్టి నేరస్తులను పట్టుకోవడంలో కృషి చేసిన, ఏ.ప్రదీప్ కుమార్, సి ఐ. పెద్దపల్లి, కె.రాజేష్, ఎస్సై పెద్దపల్లి, కానిస్టేబుల్లు మాడిశెట్టి రమేష్, దుబాసి రమేష్ లను డి సి పి పెద్దపల్లి అభినందించారు.
Image
అవినీతి అనకొండగా మారిన దుర్గగుడి ఈవో • వినియోగంలో ఉన్న లిఫ్టుల పేరుతో రూ. 2 కోట్ల బిల్లులు • సీవేజ్ ప్లాంట్ పేరు చెప్పి రూ. 53 లక్షల దోపిడి • ఫుట్ పాత్ పేరు చెప్పి రూ. 10 లక్షల బిల్లు • నిత్య ఆదాయవనరుగా మారిన మహామండపం • ఈవో అక్రమాల్లో మంత్రి వెల్లంపల్లికీ భాగస్వామ్యం • అవినీతికి సహకరించలేదనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు • మీడియా సమావేశంలో జనసేన అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ బెజవాడ కనక దుర్గమ్మ ఆలయం సాక్షిగా కోట్లది రూపాయిల అవినీతి, అక్రమాలు జరుగుతుంటే దేవాదాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. వినియోగంలో ఉన్న లిఫ్టులను చూపి అడ్డంగా రూ. 2 కోట్ల 28 లక్షల రూపాయిలు దోచేశారని ఆరోపించారు. ఈవో సురేష్ బాబు గారు అవినీతి అనకొండలా తయారయ్యారనీ, ఆయన అవినీతిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భాగస్వామ్యం ఉంది కాబట్టే కొనసాగే అర్హత లేదని హైకోర్టు చెప్పినా ఈవోను కొనసాగిస్తున్నారనీ అన్నారు. శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలోనే ఆదాయంలో రెండో అతిపెద్ద ఆలయం అయిన కనకదుర్గమ్మ ఆలయంలో అవినీతి అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? గతంలో ఈవోలుగా పని చేసిన ఎంతో మంది ఐఎఎస్ అధికారులు ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, వచ్చిన ఆదాయాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరిచారు. ప్రస్తుత ఈవో సురేష్ బాబు గారికి కొనసాగే అర్హత లేదని హైకోర్టు చెప్పినా ఎందుకు కొనసాగిస్తున్నారో మంత్రి గారికీ, దేవాదాయ శాఖ కమిషనర్ గారికే తెలియాలి. ఈవో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి బినామీగా మారారనీ, ఏ రోజు వాటా ఆ రోజు మంత్రి గారికి అందచేయడం వల్లే అర్హత లేకపోయినా కొనసాగిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. సురేష్ బాబు గారు ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు. అమ్మవారి ఆదాయాన్ని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. కోట్లాది రూపాయిల పనులకు అప్రూవల్ ఇచ్చేస్తున్నారు. కూతవేటు దూరంలో కమిషనర్ కార్యాలయం ఉన్నా పర్యవేక్షణ కరువయ్యింది. కోట్లాది రూపాయిలు చెల్లిస్తుంటే కనీస తనిఖీలు, ఆడిట్ లు ఎందుకు చేయడం లేదు. ఆలయ ప్రాంగణంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్న మంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తుంటే ఎందుకు స్పందించడం లేదు. ప్రతి విషయంలో ఈవోని వెనకేసుకుని రావడం, ఆయన చేసే అవినీతి పనులకు మద్దతు ఇవ్వడం చూస్తుంటే అందులో మంత్రి గారికి భాగస్వామ్యం ఉందని ప్రజలు భావిస్తున్నారు. • రోడ్డు పక్క ఫుట్ పాత్ కి ఆలయానికీ సంబంధం ఏంటి? మే 26వ తేదీన మల్లిఖార్జున మహామండపంలో అడిషనల్ లిఫ్ట్ ఛాంబర్ కనస్ట్రక్షన్ పేరిట రూ. 2 కోట్ల 98 లక్షలు బిల్లులు డ్రా చేశారు. కరోనా లాక్ డౌన్ కొనసాగుతుంటే ఎవరూ చూడరు, స్పందించరని వినియోగంలో ఉన్న లిఫ్టుల పేరుతో కోట్లాది రూపాయిలు చెల్లించడం దోపిడి కాదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖ మంత్రి గారిని, కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇందులో మీ భాగస్వామ్యం ఎంత? వినియోగంలో ఉన్న లిఫ్టులకు ఏరకంగా బిల్లులు చెల్లించారు? ఇంతకంటే అక్రమం ఏమైనా ఉంటుందా? కుమ్మరిపాలెం సెంటర్ నుంచి అర్జున స్ట్రీట్ వరకు ఫుట్ పాత్ నిర్మాణం పేరిట రూ. 10 లక్షల 23 వేల బిల్లులు చెల్లించారు. అదీ మే 26నే చెల్లించారు. ఈ ఫుట్ పాత్ కీ కనకదుర్గమ్మ దేవస్థానానికీ సంబంధం ఏంటి? ఫుట్ పాత్ వేస్తే నగరపాలక సంస్థ వేయాలి. లేదా ఫ్లై ఓరవర్ నిర్మిస్తున్న హైవే ఆధారిటీ నిర్మించాలి. అన్ని బిల్లులు లాక్ డౌన్ సమయంలోనే చెల్లించడం వెనుక ఆంతర్యం ఏంటి? అమ్మవారి ఆదాయాన్ని ఎందుకు దుబారా చేస్తున్నారు? • నాలుగేళ్లుగా మహా మండపాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు కమర్షియల్ కాంప్లెన్స్ ప్లేసులో రెండు మరుగుదొడ్లు కట్టి రూ. 64 వేలు బిల్లులు డ్రా చేశారు. ఏంటని అడిగితే సమాధానం చెప్పరు. అమ్మవారి సొమ్మును ఇంత బహిరంగంగా దోచుకుంటుంటే మంత్రిత్వశాఖ ఏం చేస్తోంది. ఆలయ మహామండపం నిర్మించి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యింది. దేవస్థానం అధికారులు ఇప్పటి వరకు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? మహా మండపం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది. నిత్యం ఏదో ఒక పని అని చూపుతూ లక్షలాది రూపాయిలు అక్రమ బిల్లులు పెట్టి దోచుకుంటున్నారు. సీవేజ్ ప్లాంట్ పేరుతో బయటి నుంచి విరాళాలు సేకరించారు. అవి ఏమయ్యాయో తెలియదు. ప్లాంట్ పేరుతో రూ. 53 లక్షల 69 వేల బిల్లులు ఎలా చెల్లించారో సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్పినవే రూ. 3 కోట్లు ఉన్నాయి. అమ్మవారి ఆదాయానికి ఇంత పెద్ద ఎత్తున గిండికొడుతుంటే అధికారులు, మంత్రి ఎందుకు స్పందించడం లేదు. ఈవో సురేష్ బాబు గారి అవినీతిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భాగస్వామ్యం ఉంది అందుకే అర్హత లేకపోయినా కొనసాగిస్తున్నారు. మేము ఉత్తుత్తి ఆరోపణలు చేయడం లేదు. వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాం. వాస్తవాలను మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు. అమ్మవారి సొమ్ము కోట్లాది రూపాయిలు స్వాహా చేస్తున్నా మంత్రి గారు ఎందుకు స్పందించడం లేదు. దేవస్థానంలో గత 8 సంవత్సరాలుగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కనీసం మానవత్వం చూపకుండా నిర్ధయగా తీసేశారు. కరోనా విపత్కాలంలో వారిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది. ఒక పక్కన ఆదాయం డబ్బులు లేవు అని చెబుతారు. కోట్లాది రూపాయిలు బిల్లులు చెల్లించడానికి మాత్రం డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు. అసలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసిన తప్పేంటి? దశాబ్దకాలం 12 గంటలు నిబద్దతగా పని చేయడమే వారు చేసి తప్పా? మీరు చెప్పిన విధంగా అవినీతి పనులకు పాల్పడకపోవడం వల్లనే వారిని ఉద్యోగాల్లో నుంచి తీసేసిన మాట వాస్తవం కాదా? ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ పెట్టాం. దళారీ వ్యవస్థను నిర్మూలిస్తాం అని చెబుతారు. మరి వీరి తొలగింపులో ఎందుకు జోక్యం చేసుకోరు. ప్రసాదం ప్యాకింగ్ కోసం రోజుకి రూ. 500 ఇచ్చి బయట నుంచి కార్మికుల్ని పెట్టుకుంటున్నారు. ఆ పని ఏదో వారితోనే చేయించుకోవచ్చు కదా? కొండ మీద కోర్టులు సైతం వద్దన్న ఒకరిద్దరు ఉద్యోగులను ఈవో గారికి సన్నిహితులు అన్న నెపంతో చిన్న ఆర్డర్ తో విధుల్లో కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో లడ్డూ ప్రసాదం విక్రయం అని చెప్పి వారిని అక్కడ విధుల్లో పెట్టడం వాస్తవం కాదా? విక్రయాలు నిలిపివేసిన తర్వాత కూడా విధుల్లో ఎలా కొనసాగిస్తున్నారు. మీ అవినీతిలో భాగస్వాములు అయ్యే వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారా? సెంట్రల్ నియోజకవర్గంలో కాశీవిశ్వేశ్వర ఆలయానికి సంబంధించిన 900 గజాల విలువైన భూమిని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం వెనుక స్థానిక ప్రజా ప్రతినిధి ప్రోత్సాహం ఉందన్న ప్రచారం జరుగుతుంటే స్వయానా బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న శ్రీ మల్లాది విష్ణు గారు ఎందుకు దాన్ని ఖండించడం లేదు. అది అబద్దం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు. దేవాలయ వ్యవస్థల్ని పరిరక్షించాల్సింది పోయి రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని శాశ్విత ఆదాయ వనరుగా మార్చుకునేందుకు మీరు చేస్తుంది కుట్ర కాదా? దీని మీద కూడా ఎవరూ స్పందించరు. మంత్రి పెద్ది రెడ్డి గారు జిల్లా ఇంఛార్జ్ మంత్రి హోదాలో మీరు ప్రోత్సహిస్తుంది అభివృద్ధినా? అవినీతినా? దుర్గగుడి కేంద్రంగా జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా బయటపడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? • హైకోర్టు తీర్పుని అమలుపర్చాలి దుర్గ గుడిలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే పాలక మండలి ఏం చేస్తోంది. చైర్మన్ పైలా స్వామి నాయుడు గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు. మీకు ఈవో గారి అక్రమాల్లో భాగం ఉందా? అక్రమాలను అడ్డుకోలేని ఈ పాలక మండలి పనికి రాదు కోర్టు తీర్పుల అమలుపర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఈవో సురేష్ బాబు గారు పనికి రారు అన్న హైకోర్టు తీర్పుని వెంటనే అమలుపర్చాలి అని అన్నారు.
Image