జిల్లాలోని అన్ని మండలాల్లో రైతు సలహా మండల, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది.

 కొవ్వూరు (ప్రజా అమరావతి);

విజయగాధ.


రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి, సంక్షేమం  కోసం ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, రైతు సలహా మండళ్ళు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక భరోసాను కల్పించడం జరుగు తోంది.


క్షేత్రస్థాయి లో రైతులు ఎదురుకొంటున్న సమస్యలను సకాలంలో పరిష్కారించేందుకు అధికారుల పాత్రతో పాటు అనుభవజ్ఞులైన  రైతులు ముఖ్యపాత్ర వహిస్తారనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో మరియు గ్రామ స్థాయిలో రైతు సలహా మండళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలోని  అన్ని మండలాల్లో రైతు సలహా మండల, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది.



  పెనుగొండ మండల పరిధిలో 20 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. పెనుగొండ గ్రామంలో 5, సిద్దాంతంలో 3, వడలి లో 2, మిగిలిన అన్ని గ్రామాల్లో ఒక్కొకటి చొప్పున మొత్తం 20 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాట్లు చేసి వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు మెరుగైన సూచనలు, సలహాలు ఇచ్చి రైతు లాభసాటిగా వ్యవసాయం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు.

గ్రామ స్థాయిలో ప్రతినెలా మొదటి శుక్రవారం రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాలు వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పా టు చేసింది. ప్రతీ రెండవ శుక్ర వారం మండల స్థాయి లో, ప్రతీ మూడవ శుక్రవారం జిల్లా స్థా యి లో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది.  గ్రామ స్థాయిలో చర్చించిన సమస్యలు, మండల స్థాయి సమావేశాల్లో, జిల్లా స్థాయి సమావేశాల్లో చర్చించి రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు  జరుగుతొంది.

గ్రామ స్థాయిలో జరిగే రైతులకు సంభందించిన పధకాలు అమలు చేయుట లబ్ధిదారులను ఎంపిక చేసి పధకాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గ్రామ స్థాయిలో రైతుల సమస్యలు, నీటి సమ స్య, మార్కటింగ్, విద్యుత్, బ్యాంకింగ్, ఎరువుల సరఫరా వంటి సమస్యలు, అధికారుల దృష్టికీ తీసుకువచ్చి సమస్యలను పరిష్కారించే దిశగా గ్రామ, మండలి స్థాయి లో  చర్యలు తీసుకోవడం జరుగుతోంది.  ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు రైతుల పంటలు కాపాడు కోవడానికి తగు సూచనలు చేసి వారిలో  ధైర్యం కల్పిస్తున్నారు. రైతులకు మద్దతు ధర కల్పించుటకు ఆర్భికెలు ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర లభించే విధంగా చర్య లు తీసుకుంటోంది. గ్రామాల్లో జరిగే అన్ని వ్యవసాయ కార్యకలాపాల్లో ముఖ్య పాత్ర ను వహించడం వల్ల ఈ వ్యవసాయ సలహా మండళ్ళు ముఖ్యపాత్ర పోషించడం వల్ల రైతు లకు ఎంతో మేలు జరుగుతొంది.

రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత జిల్లాలో ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన పశ్చిమగోదావరి జిల్లా లో 70 శాతం మంది వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు.ప్రతి గ్రామంలో వ్యవసాయ అనుబంధ రంగముల సమస్యలు పరిష్కరించాలని గ్రామ సచివాలయ స్థాయిలో ఒక వ్యవసాయ అధికారిని నియ మించారు. ముఖ్యమం త్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు భరోసా గా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలను  ఏర్పాటు చేసి నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుబాటులో ఉంచారు. వాటి నాణ్యత పరీక్షలు చేసి మండల కేంద్రాలకు వెళ్లకుండా వారి గ్రామంలోని రైతులకు ఆర్బికే లు ఏర్పాటు చేశారన్నారు. రైతులు తమకు కావల్సిన సాంకేతిక పరిజ్ఞానం, పంటల మార్కెట్ విలువ, తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలుసు కోవొచ్చు. అర్భికేలలో వ్యవసాయ రంగంకు సంబంధించిన పుస్తకాలు, కరపత్రాలు, నెలవారీ మాసపత్రిక లు అందుబాటులో తీసుకుని వొచ్చారన్నారు. శాశ్వత రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణా కార్యక్రమాలు, ప్రదర్శన లు, వ్యవసాయ పద్దతులపై అవగాహన కలిగించడం జరుగుతోంది. దృశ్య శ్రవణ మాధ్యమాల్లో శాస్త్రవేత్తలు, అధికారులు, నిపుణులతో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతొంది.


రైతుల మనోగతం వారి  మాటల్లోనే. పెనుగొండ గ్రామానికి చెందిన పలివెల రాముడు వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు సలహాలు పాటించడం వల్ల లాభసాటి వ్యవసాయం చేసుకుంటున్నాను. రైతులకు ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎరువులకు, విత్తనాలకు చాలా సార్లు తిరగడం జరిగేది. ఇపుడు ఈ ఆర్. బి. కె. లు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బం ది లేకుండా ఉందన్నారు. నేను గతంలో రెండు నుంచి మూడు రూపాయలకు వడ్డీకి తెచ్చి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టే వారమని నేడు ఆ పరిస్థితి లే కుండా రైతు భరోసా, వడ్డీ రాయితీ వంటి పథకాలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అదుకుంటున్నారని , ఇక పంట చివరలో ఇబ్బందులు లేకుండా ధాన్యానికి గిట్టుబాటు ధరను అందిస్తూ కళ్ళేలలోనే కొనుగోలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెట్టుబడి సాయం కింద రూ.13,500 చొప్పున ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.


పెనుగొండ గ్రామానికి చెందిన ఉప్పలపాటి రామకృష్ణ  వారి అభిప్రాయం తెలుపుతూ  

ఆర్. బి. కె లు పెట్టడం వల్ల రైతులకు చాలా మేలు జరుగుతొందన్నారు. వ్యవసాయానికి సంభందించిన అన్ని అనుబంధ ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఉండడం వల్ల రైతులు ఎక్కువ సార్లు తిరగాల్సిన పని లేదన్నారు. వైయస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని పొందుతున్నామన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయాన్ని సాగు చేస్తూ సంతోషంగా ఉన్నామన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.


Comments