దుప్పాడ ఆర్.బి.కె.కు ఐ.ఎస్.ఓ. సర్టిఫికేట్


దుప్పాడ ఆర్.బి.కె.కు ఐ.ఎస్.ఓ. సర్టిఫికేట్


విజయనగరం మార్చి, 14 (ప్రజా అమరావతి):: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందించడంతో పాటు ఆధునిక వ్యవసాయ పద్దతులపై రైతులకు అవసరమైన సలహాలు, సూచనలను ఇస్తున్న  విజయనగరం మండలం దుప్పాడ రైతు భరోసా కేంద్రం  విశేష సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఐ.ఎస్.ఓ. సర్టిఫికేట్ ను అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను అభినందించారు.   కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా వున్నాయని, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు.  ఇటీవల  కేంద్ర బృందం ఆర్.బి.కె.ల ద్వారా అందిస్తున్న సేవలను  పరిశీలన నిమిత్తం జిల్లాకు రావడం జరిగిందన్నారు.  ఉత్తమ సేవలు అందిస్తున్న దుప్పాడ  ఆర్.బి.కె.కు ఐ.ఎస్.ఓ. సర్టిఫికేట్ ను  అందించారని, మిగిలిన ఆర్.బి.కె.లు కూడా అదేరీతిలో సేవలను అందించాలన్నారు.  ఈ సందర్బంగా ఐ.ఎస్.ఓ. సర్టిఫికేట్ ను జాయింట్ కలెక్టర్ డా.జి.సి. కిషోర్ కుమార్ తో కలసి ఆవిష్కరించారు.   

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు మయూర్ అశోక్, వెంకటరావు, డిఆర్ఓ గణపతిరావు, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల జాయింట్ డైరెక్టర్లు వి.టి.రామారావు, రమణ, అగ్రోనరి, ఆర్.బి.కె. డిప్యూటీ డైరెక్టర్లు సివిఆర్ నందు, ఆనందరావు తదితర్లు పాల్గొన్నారు.


Comments