నెల్లూరు, మార్చి 5 (ప్రజా అమరావతి):-- ఉక్రెయిన్లో చదువుతున్న జిల్లాకు చెందిన మరో ఇద్దరు విద్యార్థులు శనివారం సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. జిల్లాకు అందిన అధికారిక సమాచారం మేరకు జిల్లాలోని సైదాపురానికి చెందిన బోయిల్ల లికిత రెడ్డి శనివారం బెంగళూరు విమానాశ్రయంలో దిగి అక్కడి నుండి వారి తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి సురక్షితంగా చేరుకున్నారు. అలాగే వెంకటగిరికి చెందిన గంజి మునీష్ అనే మరో విద్యార్థి శనివారం హైదరాబాద్ విమానాశ్రయం కు చేరుకుని అక్కడ సొంత పనులు చూసుకున్నాక రెండు రోజుల తర్వాత జిల్లాకు రానున్నారని జిల్లా కేంద్రానికి సమాచారం అందింది.
ఉక్రెయిన్లో చదువుతున్న జిల్లాకు చెందిన మరో ఇద్దరు విద్యార్థులు శనివారం సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు.
addComments
Post a Comment