జిల్లాలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన



జంగారెడ్డిగూడెం (తాడువాయి) (ప్రజా అమరావతి);  




జిల్లాలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి  పర్యటన 



 తాడువాయి ఆర్ అండ్ ఆర్ కాలనీ లో మంత్రి  శ్రీరంగనాధ్ రాజు పర్యటన



శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జల శక్తి మిషన్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ల  పర్యటన ఎంతో కీలకం కానుందని   రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.




గురువారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే ఎలిజా,  పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు , ఆర్ అండ్ ఆర్ ప్రత్యేక అధికారి ఓ. ఆనంద్ లతో కలిసి మంత్రి తాడువాయి ఆర్ అండ్ ఆర్ కాలనీలో పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.


ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ,గతంలో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పోలవరం ప్రాజెక్టు సందర్శించడం జరిగినా కేవలం స్పిల్ వే, కాపర్ డ్యామ్, తదిరత ప్రాంతాల్లో పర్యటనకు పరిమితం అయ్యేవరన్నారు. కానీ ఈసారి పర్యటన ప్రత్యేకత సంతరించు కుందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం లో అధికారులు, డ్యామ్ కట్టే కాంట్రాక్టర్లు మధ్య  చర్చించుకోవడం తో సరిపోతుందన్నారు. అయితే పునరావాస కాలనీలకు నిర్వాసితులను తరలించడం,  ఆర్ అండ్ ఆర్ అమలు చేయడం చాలా కీలకం అయిన అంశం అన్నారు. ఈ అంశం ప్రజలతో ముడి పడి ఉన్నందున ముఖ్యమంత్రి ఆదిశగా ఆలోచన చేసారని  మంత్రి శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి, ఉపాధి అవకాశాలు థేయ్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.  తూర్పుగోదావరి జిల్లాలోని ఇందుకూరుపేట, పశ్చిమగోదావరి జిల్లాలోని తాడువాయి లోని ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో పర్యటించి నిర్వాసిత లబ్దిదారులతో మాట్లాడి, వారికి ఉన్న అనుమానాలు తీర్చడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. తాడువాయి ట్రైబ్స్, నాన్ ట్రైబ్స్ లకు 3 వేల గృహాలు నిర్మిస్తున్నామన్నారు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఒక విధమైన జీవన శైలికి అలవాటు పడ్డారని, ఆర్ అండ్ ఆర్ కాలనీలకు రావడం వలన సర్దుబాటు కి కొంచెం సమయం పడుతుంది అనడం లో సందేహం లేదన్నారు. 


గిరిజన, గిరిజనేతరులకు  భరోసాగా నిలిచి అనుమానాలు నివృత్తి చెయ్యడం జరుగుతుందని మంత్రి శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. 2013 నూతన ల్యాండ్ యాక్ట్ వొచ్చిన తర్వాత భూముల విలువ భారీగా పెరిగాయన్నారు. గతంలో ₹. 2/3 లక్షలు ఉండే భూముల ధరలు₹. 9/10 లు పెరిగాయన్నారు. అందుకు సంబంధించిన స్థానిక శాసన సభ్యులు బాలరాజు చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఇచ్చే దాని కంటే అదనంగా పరిహారం చెల్లించాలని, ₹..10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. ఉపాధి, జీవనభృతి కి ఎటువంటి అవాంతరాలు లేకుండా ట్రైబ్స్, నాన్ ట్రైబ్స్ ను సంతృప్తి పరచాలనే వారి విజ్ఞప్తి మేరకు మేలు చెయ్యాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లడం జరుగుతోందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా లోని నిర్వాసితులు కూడా పశ్చిమగోదావరి జిల్లా కి రావడానికి ఆసక్తి చూపుతున్నారని, బుట్టయిగూడెం, జీలుగుమిల్లి ప్రాంతాల్లో ని న్యాయమైన భూములే కారణం అన్నారు. ప్రాజెక్ట్ ఎత్తు పెంచడంతో 1,50,000 వేల కుటుంబాలు నిర్వాసితులు అయ్యే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగానే చర్యలు చేపట్టామన్నారు. 


ఈ పర్యటనలో భాగంగా ఆర్ అండ్ ఆర్ కాలనీలో నిర్మాణం లో ఇళ్ళ ను శాసనసభ్యులు, అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో సూచనలు చేశారు. 


Comments