క్రికెట్ అకాడమీ కోసం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తానని హామీ

  తెనాలి (ప్రజా అమరావతి);    అండర్-19 వరల్డ్ కప్ టీమ్ కు భారత వైస్ కెప్టెన్ గా సేవలందించిన షేక్ రషీద్ ను తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు ఎండి శ్యామ్ ప్రసాద్, తెనాలి శాసనసభ్యులు  అన్నాబత్తుని శివకుమార్  మంగళవారం సత్కరించారు. గుంటూరు జిల్లాకు చెందిన రషీద్ అండర్ 19 వరల్డ్ కప్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గత నెల ఐపిల్ కోసం జరిగిన వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ కు తాను సెలెక్ట్ కావడం అభినందనీయమని మునగాల శ్యామ్ ప్రసాద్ అన్నారు. క్రికెట్ అకాడమీ కోసం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తానని హామీ


ఇచ్చారు. కఠోర శ్రమ, క్రీడలపై తనకున్న చిత్తశుద్ధి, తల్లితండ్రుల ప్రోత్సాహం రషీద్ విజయంలో కీలక పాత్ర పోషించాయని ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. జిల్లా తరపున అండర్ 19 క్రికెట్ లో విజయం సాధించిన రషీద్ కు డిఎస్పి స్రవంతి రాయ్ అభినందనలు తెలిపారు.

Comments