*"రైతుల హర్షం
"*
*నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి కొనసాగడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రైతులు.*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలంలో రైతులు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి, సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, కృషి చేసిన ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
రైతు పక్షపాతి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నెల్లూరులోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని అంతర్భాగంగా ఉంచినందుకు, మా రైతు సోదరులందరి తరఫునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
రైతు సంక్షేమం గురించి అనుక్షణం ఆలోచిస్తూ వారికి ఎప్పుడూ ఏ సమస్య వచ్చినా, నేనున్నానంటూ, ముందుండి ఆ సమస్యలకు పరిష్కారం చూపించే మన ఆత్మబంధువు, మన ఇంటి బిడ్డ, మన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ఈ బృహత్కార్యాన్ని సాధించినందుకు రైతు సమాజం అందరి తరపునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఆరుగాలం కష్టించి శ్రమ పడటమే, మా రైతులకు తెలుసు..
వ్యవసాయం చేసే రైతుకు ఏ సమయానికి ఏది అవసరమో గుర్తెరిగి విత్తనాలు, ఎరువులు దగ్గర నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న మా జగనన్నకి ఈ సందర్భంగా మా ఆనంద నీరాజనాలు.
సర్వేపల్లిలో ప్రతి రైతు ఆనందంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ప్రతి పథకం అందరికీ అందాలని తపనపడి, ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు మన రైతు బిడ్డ కాకాణి.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయడంతో పాటు, వారికి ఎదురయ్యే సమస్యలను అడుగడుగునా నేనున్నానంటూ, అధికారులతో మాట్లాడి, సకాలంలో పరిష్కరించే మా ఇంటి బిడ్డ కాకాణికి మా హృదయపూర్వక నీరాజనాలు.
రైతు భరోసా పథకం రూపకర్త రైతు పక్షపాతి మా జగనన్న, రైతులకు భరోసా గా ఉండే గోవర్ధనన్న ఇద్దరూ మాకు ఆ శివయ్య ప్రసాదించిన వరాలు.
కరోనా విపత్కర కాలంలో *"సర్వేపల్లి రైతన్న కానుక"* పేరిట మా సహాయాన్ని నిలువెత్తు పాలాభిషేకంతో కీర్తించిన గోవర్ధనన్నను మా హృదయాలలో పదిలంగా ఉంచుకుంటాం.
రాష్ట్రంలో ఎరువుల కొరత ఉన్నా, సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు గోవర్ధనన్న అధికారులతో సంప్రదించి, ఎరువుల కొరత లేకుండా చూశారు.
జిల్లాల పునర్విభజనలో పార్లమెంట్ల వారీగా జిల్లాలు ఏర్పడి, సర్వేపల్లి బాలాజీ జిల్లాలో కలిసుంటే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వారు.
సాగునీటికి నెల్లూరు జిల్లాలో ఉన్న సోమశిల, కండలేరు జలాశయాలపై ఆధారపడి సర్వేపల్లి రైతులు పండిస్తున్నారు.
సర్వేపల్లి, బాలాజీ జిల్లాలో కలిసి ఉంటే, సాగునీటి కోసం రైతాంగం అవస్థలు పడే పరిస్థితి.
సర్వేపల్లి, బాలాజీ జిల్లాలో కొనసాగితే, రైతులు ధాన్యం అమ్ముకోవడానికి నానా అవస్థలు పడేవారు.
ధాన్యం అమ్మకాలకు రైస్ మిల్లులుఅత్యధికంగా నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి.
పండించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నా, వాటిని అమ్ముకోవాలన్నా మనకు కూతవేటు దూరంలో ఉన్న నెల్లూరును విడిచి, బాలాజీ జిల్లాకు వెళ్ళవలసి వచ్చేది.
ఆందోళన చెందుతున్న రైతులకు నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి కొనసాగడం, ఊహించని తీపి కబురు.
రైతు పక్షపాతి అయిన జగనన్నకు,సర్వేపల్లి రైతులు పడే కష్టాలను రైతుల సంక్షేమం కోరే గోవర్ధనన్న, వివరించి నెల్లూరు జిల్లాలోనే కొనసాగేలా కృషి చేశారు.
ఈ మహాశివరాత్రి పర్వదినాన మాకు అతిపెద్ద కానుకను ఇచ్చిన జగనన్నకు తెచ్చిన గోవర్ధనన్నకు నిండు నూరేళ్లు ఆయుష్షు, ఆరోగ్యం, సంతోషాన్ని ప్రసాదించాలని కోరుతూ... *"జై జగన్..,జై గోవర్ధనన్న"..*
addComments
Post a Comment