పోలవరం (ప్రజా అమరావతి) ;
శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
తొలిపూజ చేసిన ఆలయ ధర్మకర్త కంచర్లకోట వీరభద్రరావు
శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ని మంగళవారం ఉదయం దర్శించుకున్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, స్వామి వారి సమక్షంలో పూజాధి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ఆ దేవదువుణ్ణి ప్రార్దించినట్లు ఆయన తెలిపారు. దేవస్థానం పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో పోలవరం శాసన సభ్యులకి స్వాగతం పలికారు.
మంగళవారం తెల్లవారుజామున పట్టిసం లో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్త, కంచెర్లకోట వంశీకులు కంచర్లకోట వీరభద్రరావు తొలి పూజ నిర్వహించారు.
తెల్లవారుజాము నుంచే పోటెత్తిన భక్త జనులు, సాయంత్రానికి మరింతగా పెరిగింది. శివరాత్రి పుణ్యదినాన్న మహా శివుణ్ణి దర్శించుకున్న భక్తులు లక్షకి పైగా చేరుకొనగా, సాయంత్రానికి మరింత మంది భక్తులు దర్శనానికి వొచ్చే అవకాశం దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పట్టిసం శివరాత్రి వేడుకల ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ రాహుల్ కుమార్ రెడ్డి దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు కోసం రెవెన్యూ అధికారిచే బోట్ లలో తీసుకుని వెళ్లాలని సూచనలు చేశారు. టోకెన్ లను జారీ చేసి వాటిని వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. బోట్ లో 30 మంది మించకుండా చూడాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో తహసీల్దార్ బి. సుమతి, టి. శ్రీనివాసరావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment