కాకాణి పర్యటన

 "కాకాణి పర్యటన


"


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో పర్యటించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


చవటపాళెం గ్రామంలో కోదండరామ స్వామి దేవస్థానానికి నూతనంగా నియమింపబడిన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకరోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాణి.


కసుమూరు చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేప పిల్లలను వదిలిన కాకాణి, కార్యక్రమంలో పాల్గొన్న  ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, తదితరులు.
 దేవాలయాలకు నియమించిన ధర్మకర్తల మండలిలో 50 శాతం యస్.సి., యస్.టి., వెనుకబడిన తరగతులకు కేటాయించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.


 ధర్మకర్తల నియామకంలో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించడం విశేషం.


 ధర్మకర్తల మండలి సభ్యులు దేవాలయాల అభివృద్ధికి శాయశక్తులా కృషి చెయ్యాలి.


 దేవుని ఆస్తులను కాపాడడంలో, దేవాలయాలకు రావలసిన ఆదాయంలో రాజీపడకుండా, దేవాలయాల అభివృద్ధే ధ్యేయంగా పని చెయ్యాలి.


 సర్వేపల్లి నియోజకవర్గంలో మత్స్య సంపద పై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి.


 చెరువులలో చేపలు వదలడం వల్ల మత్స్య సంపద పెరిగి, యస్.సి., యస్.టి.లకు గణనీయంగా ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి.


 స్థానికంగా ఉండే చెరువులలో చేపలు అందుబాటులో ఉంటే, సరసమైన ధరలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, పేదలు కూడా భుజించే అవకాశం కలుగుతుంది.


 మత్స్యకార సొసైటీ లు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వాటికి 60 శాతం సబ్సిడీతో, చేపపిల్లలు సరఫరా చేయబడుతున్నాయి.


 జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల పరిధిలోనే, ఫిష్ అవుట్ లెట్లను ప్రారంభించినందున, ప్రజలకు తక్కువ ధరలకే అనేకరకాలైన సీ-ఫుడ్ పొందే అవకాశం కలిగింది.


 రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు, ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.


 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అన్ని వసతి సదుపాయాల కల్పనే ధ్యేయంగా పని చేస్తాం.

Comments