మే 2 సోమవారం స్పందన కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలోనేరాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


మే 2 సోమవారం స్పందన కార్యక్రమం  కలెక్టర్ కార్యాలయంలోనే


 


 బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఉ.9 గంటల  నుంచి  మ.2 వరకు


కలెక్టర్ డా. మాధవీలత 


 సోమవారం (మే 2 ) న ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు "స్పందన " కార్యక్రమం ఈ వారం కలెక్టర్ కార్యాలయంలో నే నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత శనివారం  ఒక ప్రకటన లో తెలియచేసారు. 


ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్, ప్రజల కోసం ఉచిత బస్సు సర్వీస్ కొనసాగిస్తున్నామని  ఉదయం 9 నుంచి  మ.2 వరకు ఉచిత బస్సు సర్వీస్ నడుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.


గతవారం నిడదవోలు నియోజకవర్గం పరిధిలో స్పందన నిర్వహించగా ఈ వారం రాజమహేంద్రవరం రూరల్, హర్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న కలెక్టర్ కార్యాలయం లో స్పందన పిర్యాదులు ఉదయం 10 నుంచి మ.1 గంట వరకు స్వీకరిస్తారు.