రేపు (22.04.2022, శుక్రవారం) ఒంగోలులో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ పర్యటన.


అమరావతి (ప్రజా అమరావతి);


రేపు (22.04.2022, శుక్రవారం) ఒంగోలులో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ పర్యటన.


వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పీవీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగం అనంతరం వైఎస్సార్‌ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం బందర్‌ రోడ్‌లోని రవిప్రియ మాల్‌ అధినేత కంది రవిశంకర్‌ నివాసానికి వెళ్ళి, వారి కుటుంబంలో ఇటీవల వివాహం అయిన నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Comments