రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ కులాలు వారి నుంచి ఎస్సీ కమిషన్ పనితీరు పట్ల సానుకూలత వ్యక్తం అవుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్. సి. కమిషన్ చైర్మన్ శ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు.
శనివారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఎస్సీ కమిషన్ పనితీరుపై మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది ఆగస్ట్ 24 తేదీన నన్ను ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించడం జరిగిందన్నారు. తనకు ప్రతి అంశంపై, రంగం పై పూర్తి అవగాహన ఉందని అన్నారు. కమిషన్ లో ఐదు సభ్యులతో కలిసి మా జాతి ప్రజల కోసం పనిచెయ్యడం జరుగుతోందన్నారు. షెడ్యూల్ కులాల ప్రజలు , సంఘాలు చేసేవి ఆత్మ గౌరవం పోరాటం, హక్కులు కోసం చేసే పోరాటం అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ లకు ఎక్కడ సమస్య వచ్చినా స్పందిస్తూన్నా మన్నారు. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి న్యాయం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులను ఒకటే కోరుతున్నానని రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు చట్ట ప్రకారం మాకు కల్పించిన హక్కుల్ని పరి రక్షించాలన్నారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ లపై పలు పిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. మా జాతి ప్రజలు దాడులకి, దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. కొందరి అధికారుల వలన ప్రభుత్వా నికి చెడ్డ పేరు వస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎక్కడ ఎస్సీ లకి అన్యాయం జరిగినా మాదృష్టికి తీసుకుని వొస్తే పరిష్కారం కోసం కమిషన్ పనిచేస్తుందని విక్టర్ ప్రసాద్ తెలియచేశారు.
ఎస్సీ కమిషన్ చైర్మన్ ను కలిసిన వారిలో ఎస్సీ ఎస్టీ మెంబర్ బి జార్జి ఆంతోని తో పాటు పలువురు ఎస్సీ సంఘాల ప్రతినిధులు తాడి బాబ్జి, కోరుకొండ చిరంజీవి, మధ్య బాబ్జి, ఎస్. శ్రీరామ్, తాళ్లూరు బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు
addComments
Post a Comment