వినూత్నంగా వలంటీర్ల సేవా పురస్కారాల ప్రదానోత్సవం

 వలంటీర్లే వక్తలు* 


*వినూత్నంగా వలంటీర్ల సేవా పురస్కారాల ప్రదానోత్సవం* 



దేశానికి ఆదర్శంగా నిలిచిన సచివాలయ వ్యవస్థ*


*'ప్రజల ఫిర్యాదులు స్పందన దాకా రాకూడదు'* 


: *జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్* 


పుట్టపర్తి, ఏప్రిల్ 07 (ప్రజా అమరావతి);


శ్రీ సత్యసాయి జిల్లాలో వాలంటీర్ల సేవా పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ వినూత్నంగా నిర్వహించారు. సేవ వజ్ర, సేవ రత్న, సేవ మిత్ర అవార్డులు పొందిన వాలంటీర్లే నేడు హీరోలని, వారే తమ అనుభవాలను పంచుకుని తోటి వాలంటీర్లలో స్ఫూర్తిని నింపాలని కోరారు. 


గురువారం ఉదయం సత్యమ్మ గుడి సమీపంలో  జానకి రామ్ కల్యాణ మండపంలో  పుట్టపర్తి  పురపాలక పరిధిలో నిర్వహించిన గ్రామ, వార్డు వలంటీర్ల సేవా పురస్కారాల ప్రదానం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ హాజరయ్యారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి  ఆదర్శంగా నిలిచిన సచివాలయ  వ్యవస్థని పేర్కొన్నారు

సేవ వజ్ర, సేవ రత్నలు పరిమితి సంఖ్యలో ఉంటారని.. పెద్ద సంఖ్యలో నేడు సేవ మిత్ర అవార్డులు పొందిన వారు రేపటి రత్నాలు, వజ్రాలు కావాలని పిలుపునిచ్చారు. 


వాలంటీర్లు మరింత ఉత్సాహంగా పని చేసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులే అందకుండా చూడాలన్నారు. 


ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయమే పింఛన్ల పంపిణీ పూర్తి చేయడం, క్రమం తప్పకుండా బయో మెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయడం, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటం, ప్రభుత్వ పథకాల ఫలాలు లబ్ధిదారులకు దక్కేలా చూడటం, కోవిడ్ సమయంలో ఫీవర్ సర్వే, ఇంటింటి సర్వే నిర్వహించడం వంటి కార్యక్రమాలలో ఉత్తమ ఫలితాలు చూపడం వల్లే అవార్డులు దక్కాయని సేవా వజ్ర, సేవా రత్న పురస్కారాలు పొందిన వాలంటీర్లు పేర్కొన్నారు. 


వలంటీర్ల వ్యవస్థ భారత దేశ పరిపాలన చరిత్రలో ఒక విప్లవాత్మక చర్య అనీ.. రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థతో మొదలైన అధికార వికేంద్రీకరణ నేడు నూతన జిల్లాల ఏర్పాటుతో మరింత పరిపూర్ణమైందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఉద్యోగస్తుల జీతాలైనా ఒకటో తేదీకి అటో, ఇటో అవ్వడం జరుగుతోంది కానీ వృద్ధాప్య పింఛన్లు ఒకటే తేదీని అందించడం వలంటీర్ల వల్లే సాధ్యమవుతోందన్నారు.  


కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు*


*సేవా వజ్ర*

సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 30,000 నగదు బహుమతి. 


*సేవా రత్న*

సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 20,000 నగదు బహుమతి. 

*సేవా మిత్ర*

సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 10,000 నగదు బహుమతి. 



అనంతరం నరసరావుపేట జిల్లా నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  ఉత్తమ గ్రామ వాలంటీర్లకు సేవ మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులు,  వాలంటీర్లు వీక్షించారు.




పుట్టపర్తి పురపాలక సంఘం పరిధిలో

వడ్డే సాయిలీలకు సేవా వజ్ర పురస్కారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేసి శాలువాతో సత్కరించారు. 


ఈ కార్యక్రమంలో జేసీ దినేష్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్, మునిసిపల్ చైర్ పర్సన్ తుంగ ఓబులపతి, పుట్టపర్తి మునిసిపల్ కమిషనర్ మునికుమార్, కౌన్సిలర్ గీత, ఎంపీడీవో, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 


Comments