తాడేపల్లి (ప్రజా అమరావతి);
*పెనుమాకలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ట మహోత్సవం*
*ఐదు రోజులపాటు జరగనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం*
*ఏప్రిల్ 30 నుండి మే*
*4 తేదీ వరకు ప్రతిష్ట* *మహోత్సవం*
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పెనుమాక లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిష్ట మహోత్సవం ఈనెల ఏప్రిల్30 నుండి మే 4 తేదీ వరకు జరుగుతుందని శ్రీ వైష్ణవ మహా దివ్య క్షేత్ర ఆగమన పండితులు ప్రధాన చార్యులు
ప్రతిష్ట ఆధ్వర్యలు శ్రీ డి.వి.
బాలాజీ రంగాచార్యులు మంగళవారం సాయంత్రం శ్రీ వైష్ణవ మహా దివ్య క్షేత్రం ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా శ్రీ డి.వి బాలాజీ రంగాచార్యలు మాట్లాడుతూ.
పెనుమాక శ్రీ వైష్ణవ మహా దివ్య క్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము నందు అత్యంత వైభవంగా ప్రతిష్ట జరగనుందని తెలిపారు. 74 అడుగుల ఎత్తైన రాజగోపురం, 33 అడుగుల శ్రీ రామానుజాచార్యుల స్వామి వారి విరాట్ స్వరూపం, కార్యసిద్ధిని చేకూర్చే శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం,శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సర్వార్థ సిద్ధి యంత్రమును ప్రతిష్టించడం జరుగుతుందని తెలిపారు.
త్రితళములతో (మూడు అంతస్థులతో) శ్రీ వైష్ణవ దివ్య దేశం లను ఒకే చోట దర్శించే విధముగా ఏర్పాటవుతున్న టువంటి దివ్య సౌదమని అన్నారు. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులు మన రాష్ట్రం నుండి కూడా ప్రభుత్వ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి ప్రధమ దర్శనం చేసుకొని స్వామి వారి అనుగ్రహాన్ని పొందాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో
ఆలయ కమిటీ అధ్యక్షులు
శ్రీ చలవాది మల్లికార్జున రావు,
ప్రధాన కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు, కోశాధికారి
శ్రీ రెడ్డి ఉమామహేశ్వర్ గుప్తా
దేవాలయ చైర్మన్ శ్రీ మాజెటి వెంకట దుర్గాప్రసాద్,
సభ్యులు వక్కలగడ్డ శ్రీకాంత్,
గట్ట సుబ్బారావు,గట్ట ధన ప్రసాదరావు, నూనె వెంకట సుబ్బారావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment