అమరావతి (ప్రజా అమరావతి);
*–జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో స్పందనపై సీఎం వీడియో కాన్ఫరెన్స్.*
*– క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్.జగన్.*
*–స్పందనలో భాగంగా ఉపాధి హామీ కార్యక్రమం కింద చేపట్టిన పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, ఏఎంసీలు, బీఎంసీలు, గృహనిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష , ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భూ సేకరణ, వైద్య, విద్యాశాఖలో నాడు – నేడు, స్పందన కింద అర్జీల పరిష్కారం తదితర అంశాలపై సీఎం సమీక్ష.*
*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..:*
*పాలనా సౌలభ్యంకోసమే కొత్త జిల్లాల ఏర్పాటు:*
– 26 జిల్లాలను ఎందుకు ఏర్పాటు చేశామన్న విషయాలు ప్రతి కలెక్టర్‌కు, ఎస్పీకి తెలియాలి:
– పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం:
– ప్రజలకు అందుబాటులో ఉండడానికి, వారి పట్ల మరింత బాధ్యతగా ఉండడానికి ఈ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం:
– కలెర్టులు, ఎస్పీలు ప్రభుత్వ ప్రతినిధులుగా జిల్లాల్లో ఉంటారు:
– తాము బాస్‌లం కాదు, ప్రజలకు సేవకులుగా ఉంటామనే విషయాన్ని వారు నిరంతరం దృష్టిలో పెట్టుకోవాలి:
– ప్రజల పట్ల మరింత మానవీయ దృక్పథంతో ఉండాలి:
– మనం ఎదిగే కొద్దీ, ఒదగాలి.. దీన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి:
– ఇప్పుడు మీరంతా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నేను మీకు ఇచ్చే సలహా ఇది:
*ఉపాధిహామీ పనులు(ఎన్‌ఆర్‌ఈజీఎస్):*
– ఏప్రిల్, మే, జూన్... ఈ 3నెలల్లో ముమ్మరంగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది:
– నిర్దేశించుకున్న పనుల్లో కనీసం 60శాతం ఈ 3 నెలల్లో పూర్తిచేయాలి, దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి:
– ఏప్రిల్‌నెలలో 250 లక్షల పనిదినాలను లక్ష్యంగా పెట్టుకున్నాం:
– ఇప్పటికే 185 లక్షల పనిదినాలు చేశాం, మిగిలిన పనులు వేగంగా చేయాలి:
– ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి జిల్లాలో కూడా ప్రతిరోజూ కనీసం 1 లక్షల పనిదినాలు చేయాలి:
– నెలలో కనీసంగా 25 లక్షల పని దినాలు ప్రతిజిల్లాలో చేపట్టాలి: – కలెక్టర్లు విస్తృతంగా పర్యటనలు చేసి, సమీక్షలు చేసి... ఈ లక్ష్యాలను సాధించాలి :
– కలెక్టర్లు, జేసీలు, పీడీలు, ఎంపీడీఓలు.. ఇలా ప్రతి అధికారి ప్రత్యేక దృష్టిపెట్టాలి:
– సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్... ఇలా భవనాల నిర్మాణాలను సంబంధించి బిల్లులను క్లియర్ చేశాం:
– ఈనెలలో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను తెప్పించుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నాం:
– ఈనెలాఖరులోగా ఈడబ్బు వచ్చే అవకాశం ఉంది:
– కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉపాధి హామీ నిధులు ఈనెలాఖరులోగా వచ్చేలా అధికారులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు:
– గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌క్లినిక్కులు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు.. అన్నింటినీకూడా పూర్తిచేయాలి:
– కంపెనీల నుంచి సిమ్మెంటు సప్లైలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి కలెక్టర్లు ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి:
– సిమెంటు, స్టీలు, ఇసుక, మెటల్ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్ అధికారికి బాధ్యతలు అప్పగించాలి:
– దీనిపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి:
– ప్రతి సచివాలయం పరిధిలో మరోసారి పునఃపరిశీలన చేసి.. భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి:
– డిసెంబర్ నాటికి 4545 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తికావాలి:
– అదే సమయానికి ఇంటర్నెట్ కేబుల్‌కూడా సంబంధిత గ్రామాలకు చేరుకుంటుంది:
– గ్రామాల్లోనే వర్క్‌ఫ్రం హోం అందుబాటులోకి వస్తుంది:
*ఇళ్లనిర్మాణం:*
– ఇళ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.13వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం.
– దీనివల్ల జిల్లాలో ఆర్థిక ప్రగతితోపాటు, రాష్ట్ర జీఎస్‌డీపీ పెరగడమే కాకుండా చాలామందికి ఉపాధి లభిస్తుంది.
– జిల్లాల్లో ఉత్పత్తిరంగం సామర్థ్యం పెరుగుతుంది:
– ప్రతి జిల్లా జీడీపీ మరో స్థాయికి చేరుతుంది:
– తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం:
– కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగులో పండింది:
– ఈ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలి:
– వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలి:
– అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందాలి:
– అర్హులకు ఇళ్లు రాకుండా కత్తిరించడం అన్నది సరైనది కాదు:
– అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాల్సిందే, దీనికి ఎంత ఖర్చైనా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది:
– కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి:
– ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణంపైనా కలెక్టర్లు దృష్టిపెట్టాలి:
– ప్రతి వేయి ఇళ్లకూ ప్రత్యేకంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను పెట్టాలి:
– ఇళ్ల నిర్మాణంపై రోజూ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి:
– లే అవుట్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా పూర్తిచేయాలి:
– ఆప్షన్ 3 కింద ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నాం:
– అదే రోజు విశాఖపట్నంలో 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం:
– ఇళ్ల మంజూరు పత్రాలను వారికి అదేరోజు ఇస్తున్నాం:
– అదే రోజున 1.79 లక్షల పీఎంఏవై–వైయస్సార్ గ్రామీణ్ ఇళ్ల నిర్మాణంకూడా ప్రారంభిస్తున్నాం:
– తద్వారా మొత్తంగా చూస్తే మొదటి విడత ఇళ్ల నిర్మాణంలో భాగంగా 15.6 లక్షలు, రెండో దశలో 3.02 లక్షల ఇళ్లు, 2.62 టిడ్కో ఇళ్లు కలిపి మొత్తంగా 21.4 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం:
– అలాగే పెద్ద లే అవుట్లలో బ్రిక్ తయారీ యూనిట్లు నెలకొల్పడంపైనా దృష్టిపెట్టాలి:
– ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లే అవుట్లలో నీరు, కరెంటు సదుపాయాలను కల్పించాలి:
– మురుగునీరు పోయే సదుపాయాలను కూడా కల్పించాలి:
– ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులను సత్కరిస్తాం:
– మండలానికో సర్పంచి, మున్సిపాల్టీలో కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జిల్లాకు ఒక జడ్పీటీసీ చొప్పున వారికి అవార్డులు ఇస్తాం:
*ఏడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరు మదింపు:*
– ఇళ్ల నిర్మాణం, స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు, సమగ్ర భూసర్వే, స్పందనలో అర్జీల పరిష్కారంలో నాణ్యత, ఎస్‌డీజీ లక్ష్యాలు, ఉపాధిహామీ పనులు, సచివాలయాల పనితీరు... ఈ అంశాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరును మదింపు చేస్తాం:
– ఏసీబీ, ఎస్‌ఈబీ, దిశ, సోషల్‌మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తాం:
– ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి ముందుకు సాగాలి:
– ఒక గంటలోపలే సమీక్షచేసుకుని.. పనిలో ముందుకుసాగాలి:
– సమీక్ష పేరుతో అనవసరంగా కాలహననం వద్దు:
– సమీక్షలు క్రమం తప్పకుండా ముందుకు సాగాలి:
*జగనన్న సంపూర్ణగృహ హక్కు పథకం:*
– పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లు అన్నింటినీ మే 31 లోగా పూర్తిచేయాలి:
– 21ఏ డిలీషన్ ప్రక్రియను జూన్ చివరినాటికి పూర్తిచేయాలి:
– ఈ పథకాన్ని వినియోగించుకున్న వారికి బ్యాంకులు రూ.3 లక్షలు కూడా రుణం ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి:
– పథకం వల్ల జరిగే లబ్ధిని వివరించాలి:
– ప్రత్యేక క్యాంపులు పెట్టి లబ్ధిదారులకు తోడుగా నిలవండి:
*90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలు ఇవ్వడంపైనా కలెక్టర్లు దృష్టిపెట్టాలి:*
ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదు :
దీనికి అవసరమైన భూమిని సేకరించి వెంటనే పట్టాలు అందేలా చర్యలు తీసుకోండి:
*జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష పథకం:*
– 14వేలకుపైగా ఉన్న రెవిన్యూ గ్రామాల్లో మూడు విడతల్లో సమగ్ర సర్వే పూర్తవుతుంది:
– రికార్డుల స్వచ్ఛీకరణ కూడా వెంటనే జరగుతుంది:
– ముగింపు కార్యక్రమంగా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వస్తాయి:
– నవంబర్ 30లోగా మొదటి విడతలో సర్వే చేస్తున్న 5200 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐ డేటా వస్తుంది:
– డిసెంబర్ 31లోగా రెండో విడత కింద సర్వే చేస్తున్న 5700 గ్రామాలకు ఓఆర్‌ఐ డేటా వస్తుంది:
– 2023 జనవరి నెలాఖరున మూడో విడతలో భాగంగా సర్వే చేస్తున్న 6460 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐ డేటా వస్తుంది:
– ఈ డేటా వచ్చాక ఐదు నెలల కాలంలో మొత్తం సర్వే ప్రక్రియ పూర్తికావాలి:
– దీని తర్వాత గ్రామ సచివాలయాల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు కావాలి:
*రోడ్లు:*
– రాష్ట్రంలో ముమ్మరంగా రోడ్ల మరమ్మతులు, నిర్వహణ, విస్తరణ, కొత్త హైవే ప్రాజెక్టులను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేపడుతున్నాం:
– 8వేల కిలోమీటర్ల నిడివి ఉన్న రోడ్ల మెయింట్ నెన్స్ పనులు రూ.2,500 కోట్లతో ముమ్మరంగా జరగుతున్నాయి:
– ఇప్పటికే రూ.800 కోట్ల బిల్లులు కూడా ఇచ్చాం:
– నిడా కింద రూ.1158 కోట్లను 720 కి.మీ. రోడ్లను కూడా వెడల్పు చేస్తున్నాం:
– ఇప్పటికే 700 కోట్లు బిల్లులు చెల్లించాం, జూన్ నాటికి ఈపనులు పూర్తవుతాయి:
– సుమారు రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు సహాయంతో మండల కేంద్రాలనుంచి ఉమ్మడి జిల్లాకేంద్రాలకు రోడ్లు వెడల్పు చేస్తున్నాం.
– మేలో పనులు ప్రారంభం అవుతాయి, రెండో విడత పనులు డిసెంబరులో ప్రారంభం అవుతాయి:
– రూ.1017 కోట్లతో సుమారు 5వేల కిలోమీటర్ల రోడ్ల పనులను వచ్చే నెలలో ప్రారంభిస్తున్నాం:
– జాతీయ రహదారుల కింద 99 ప్రాజెక్టులను సుమారు 3079 కిలోమీటర్ల మేర పనులు చేసడుతున్నాం:
– దీనికోసం దాదాపుగా రూ.29,249 కోట్లు ఖర్చు పెడుతున్నాం:
– మరో 45 ప్రాజెక్టుల కింద సుమారు మరో 3వేల కిలోమీటర్లకు సంబంధించి పనులు డీపీఆర్ దశ దాటాయి. దాదాపు రూ.29వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం:
– ఇవికాక ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కింద ఆరు ప్రాజెక్టుల్లో నాలుగు ప్రాజెక్టులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. పనులు ప్రారంభం అవుతున్నాయి:
– బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు గ్రీన్ ఫీల్డ్‌ప్రాజెక్టుకు డిసెంబరులో పనులు ప్రారంభం అవుతున్నాయి:
– జాతీయ రహదారులు, ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కోసమే రూ.90వేల కోట్ల విలువైన పనులు రాష్ట్రంలో చేపడుతున్నాం:
– ఈ ప్రాజెక్టులు ముందుకు సాగాలంటే.. భూ సేకరణ సకాలానికి పూర్తి కావాలి:
– రోడ్ల నిర్మాణానికి సంబంధించి కలెక్టర్లు.. భూసేకరణపై దృష్టిపెట్టాలి:
– ఈ భారీ ప్రాజెక్టులు వల్ల ఉపాధి మెరుగుపడుతుంది, పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది:
– అందువల్ల భూ సేకరణలో ఎలాంటి జాప్యం ఉండకూడదు:
– దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి:
– పనులు పూర్తిచేసిన రోడ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పరిశీలించాలి:
– పనులు పూర్తైన విషయాన్ని ప్రజల ముందుపెట్టాలి:
– చరిత్రలో ఇంత డబ్బు ఎప్పుడూ కూడా రోడ్ల కోసం ఖర్చుచేయలేదు:
– మరమ్మతులు, విస్తరణ, కనెక్టివిటీ... ఇలా పలు రూపేణా కొత్తరోడ్లు నిర్మాణం అవుతున్నాయి:
– ఇవన్నీకూడా ప్రజలకు తెలియాలి:
– ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు ... రోడ్లు నిర్మాణాన్ని పరిశీలించాలి, పర్యవేక్షించాలి:
– దీనివల్ల నాణ్యతమీద కూడా పర్యవేక్షణ ఉంటుంది:
*నాడు – నేడు పనులు:*
– ఆరోగ్యం, విద్యా రంగాలపై భారీగా ఖర్చు చేస్తున్నాం:
– ఆరోగ్యం రంగంమీద దాదాపు రూ.16వేల కోట్లు, విద్యారంగంలో నాడు – నేడు కోసం మరో రూ.16వేల కోట్లు ఖర్చు సుమారుగా ఖర్చుచేస్తున్నాం:
– నాడు – నేడు కింద చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికిన పూర్తిచేయాలి:
– మొత్తం 1125 పీహెచ్‌సీల్లో 977 చోట్ల నాడు – నేడు కింద పనులు చేపట్టగా 628 ఆస్పత్రుల్లో పూర్తయ్యాయి:
– మిగిలిన చోట్ల కూడా పనులను వేగవంతం చేయాలి:
– మరో 148 చోట్ల కొత్తవాటి నిర్మాణం చేపడుతున్నాం:
– 168 సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కూడా పనులు వేగవంతం చేయాలి:
– మే 15 కల్లా అన్ని కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభం కావాలి:
– వచ్చే రివ్యూనాటికి అన్ని బోధనాసుపత్రుల పనులు ప్రారంభం కావాలి:
– లేకపోతే కలెక్టర్లను బాధ్యుల్ని చేస్తాను:
– ఫేజ్ –2 కింద 26,451 స్కూళ్లలో నాడు – నేడు పనులు రెండోదశ కింద చేపడుతున్నాం:
– దాదాపు రూ.8వేల కోట్లకుపైగా నిధులను ఇప్పటికే టై అప్ చేశాం:
– యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు ముందుకుసాగాలి:
– మే 2 నుంచి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో తిరిగి ఇదివరకూ నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న దాదాపు 15వేల స్కూళ్లను ప్రారంభిస్తారు. దీంతోపాటు రెండో దశ పనులను ప్రారంభిస్తారు:
– ఈ యాక్టివిటీలో కలెక్టర్లు పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి:
– పనులను స్కూలు కమిటీలు చేస్తాయి కాబట్టి, కలెక్టర్లు ఆ కమిటీలకు తోడుగా నిలవాలి:
– నాడు నేడు కింద స్కూళ్ల నిర్వహణ బాగుండాలి:
– స్కూలు మెయింటినెన్స్ ఫండ్ కింద నిధులు ఉన్నాయి. ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే పరిష్కరించాలి:
– ఏ సమస్య ఉన్నా.. వెంటనే దాన్ని అడ్రస్ చేయాలి:
– మీరు పట్టించుకోకపోతే మళ్లీ స్కూళ్లు సమస్యల్లోకి వెళ్లిపోతాయి:
– నిర్వహణ బాగుంటే... స్కూళ్లన్నీ ఎప్పుడూ కొత్తగా కనిపిస్తాయి:
– మనం కొత్తగా 28వేల తరగతి గదులను కూడా నిర్మిస్తాం:
– ఆస్పత్రులైనా, స్కూళ్లైనా..వాటిని బాగా నిర్వహించాలి:
– దీనిపై ప్రోటోకాల్స్‌కూడా అందుబాటులో ఉన్నాయి:
*స్పందన అర్జీలు:*
స్పందన అర్జీల పరిష్కారంలో వివిధ స్ధాయిలో పర్యవేక్షణ జరగాలి :
–సచివాలయం స్ధాయి నుంచి మండల స్ధాయి, జిల్లా స్ధాయి వరకు కలుపుకుని వివిధ స్ధాయిలో ఈ పర్యవేక్షణ ఉండాలి :
– స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత ముఖ్యమైనది:
– మా కలెక్టర్ బాగా పనిచేస్తున్నాడని ప్రజలు అనగలిగితే.. అర్జీలు నాణ్యతతో పరిష్కారమైనట్టే:
– అర్జీల పరిష్కారంలో అన్ని స్థాయిల్లో కలెక్టర్లు సమీక్ష, పర్యవేక్షణ చేయాలి:
– ప్రధానంగా నాలుగైదు అంశాలపై కలెక్టర్లు దృష్టి సారించాలి :
– నిర్ణయించుకున్న కాలపరిమితిలోగానే అర్జీలను పరిష్కరించాలి:
– నిర్ణీత సమయంలోగా పెండింగులో పెట్టకూడదు:
– తిరిగి ఒకే సమస్యపై రెండోసారి అర్జీ వస్తే..., అదే అధికారితో కాకుండా.. .అతనికన్నా పై అధికారితో ఆ అర్జీని పరిష్కరింపచేయాలి:
– అర్జీలను నాణ్యతతో పరిష్కరించకపోతే.. మొత్త ఈ ప్రక్రియ అంతా అర్థంలేనిది అవుతుంది:
– గ్రామ సచివాలయం దగ్గర నుంచి...కూడా అర్జీల పరిష్కారంలో ప్రత్యేక దృష్టి ఉండాలి:
మనం సక్రమంగా చేస్తున్నామా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి :
– అర్జీల పరిష్కారంలో నాణ్యత అనేది చాలా ప్రధానమైన అంశం :
– అర్జీల పరిష్కరిస్తున్న విధానాన్ని పరిశీలించడానికి జిల్లా, డివిజన్, మండలాల స్థాయిలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి :
–ఆ యా స్ధాయిలోలో వారానికి ఒకసారి అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించాలి :
– ఆ విధులను మరొకరికి అప్పగించరాదు :
– స్పందనపై కచ్చితంగా కలెక్టర్ల మార్కు ఉండి తీరాలి :
– ఇది మీ కార్యక్రమం, మీరు మాత్రమే ఈ కార్యక్రమంపై దృష్టి సారించాలి :
– వేరొకరికి ఈ కార్యక్రమాన్ని అప్పగించవద్దు, మీరే స్పందనను స్వయంగా పర్యవేక్షించండి :
సచివాలయాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3–5 వరకు స్పందన నిర్వహిస్తున్నారు :
– అలా ఎవరైనా నిర్వహించకపోతే అందుకు సంబంధించిన నివేదికలు మీరే తెప్పించుకుని, పర్యవేక్షించాలి :
– అర్జీలు తీసుకున్న రోజునే వారికి రశీదు ఇవ్వాలి, వారి మొబైల్‌నంబర్‌ను రిజిస్టర్ చేయాలి:
– అర్జీపై విచారణ జరగుతున్నప్పుడు ఈ ప్రక్రియలో పిటిషనర్‌ను భాగస్వామి చేయాలి:
– క్షేత్రస్థాయి విచారణలో తప్పనిసరిగా పిటిషనర్‌ను పిలవాలి:
– ఫొటో తీసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి:
– తమ సమస్యను పట్టించుకుంటున్నారనే తృప్తి పిటిషనర్‌కు ఉంటుంది:
– అర్జీ పరిష్కారాన్ని నేరుగా పిటిషనర్‌కు వివరించాలి:
– అర్జీ పరిష్కరిస్తున్నామా ? తిరస్కరిస్తున్నామా? అన్నది తెలియజేయాలి :
– గ్రామ సచివాలయ సిబ్బంది లేదా, వాలంటీర్లతో అర్జీ పరిష్కార నిర్ణయాలను అర్జీదారులకు వివరించాలి:
– మరోసారి ఫొటో తీసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి:
– ఇది అర్జీదారునికి సంతృప్తి నిస్తుంది:
– స్పందన కార్యక్రమం మీద కలెక్టర్ ముద్ర ఉండాలి:
– కలెక్టర్‌గా సక్రమంగా వ్యవహరిస్తేనే స్పందన విజయవంతం అవుతుంది :
– ప్రస్తుతం జిల్లాల పరిణామం తగ్గింది, ఏడు నియోజకవర్గాలకు పరిమితం అయింది :
ఏదైనా దరఖాస్తు గతంలో తిరస్కరణకు గురై, రెండోసారి మరలా అప్లై చేసుకుంటే అది మీ దృష్టికి రావాలి :
*సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం*
– ప్రతినెల చివరి శుక్రవారం, శనివారం వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సిటిజన్ అవుట్‌రీచ్ కార్యక్రమం చేపట్టాలి:
– ప్రతి ఇంటికి వెళ్లాలి :
– వచ్చే నెలలో చేపట్టనున్న కార్యక్రమాలను వారికి వివరించాలి:
– ప్రతి వారంలో రెండు రోజులపాటు కలెక్టర్లు, జేసీలు గ్రామ సచివాలయాలను పర్యవేక్షించాలి:
*మే నెలలో అమలు చేయనున్న పథకాలు:*
– జగనన్న విద్యా దీవెన
– ఉచిత పంటల బీమా పథకం
– వైయస్సార్ రైతు భరోసా
– మత్స్యకార భరోసా
– ఈ నాలుగు కార్యక్రమాల గురించి వారికి వివరించాలి :
సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమాలను కూడా కలెక్టర్లు పర్యవేక్షించాలి :
సచివాలయాలపై ఎంత దృష్టి పెడితే అంత సమర్దవంతంగా పనిచేస్తాయి :
– కలెక్టర్, జేసీలు వారానికి రెండు సచివాలయాలు పర్యటించాలి :
– దిగువస్ధాయి అధికారులు వారానికి కనీసం నాలుగు సచివాలయాలు సందర్శించాలి :
– మీరు సందర్శనకు వెళ్లినప్పుడు వచ్చే నెలలో రానున్న పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ చేశారా లేదా అన్నది చూడాలి :
ముందు నెలలో అమలైన పథకానికి సంబంధించిన మరలా మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి :
సచివాలయ సిబ్బంది పనితీరు ఎలా ఉందనేది పర్యవేక్షించాలి :
మీరు మంచి చేస్తే నేను మంచిచేసినట్లవుతుంది :
మీరు నా కళ్లు చెవులు :
– రాష్ట్రంలో ఎలాంటి అవినీతి, వివక్షకు తావు లేకుండా పథకాలను అమలు చేస్తున్నాం:
– రూ.1.37 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లో బటన్ నొక్కడం ద్వారా నేరుగా వేశాం:
ఇదంతా మీ పర్యవేక్షణ వల్లే సాధ్యమైంది :
స్పందనలో కలెక్టర్లకు సీఎం శ్రీ వైయస్.జగన్ నిర్దేశం.
స్పందన వీసీలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్యసలహారు అజేయ కల్లం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment