డిజిపి కార్యాలయం (ప్రజా అమరావతి);
*దిశ అప్లికేషన్ పైన అపోహలు వద్దు*
• మహిళలు, చిన్నారుల భద్రత కోసం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి వ్వక్తి గత భద్రతకు పెద్ద పీట వేస్తూ దిశ యప్ రూపొందించడం జరిగింది.
• ఈ అప్లికేషన్ ద్వారా ఎవరి కదలికలను గుర్తించడం, పరిశీలించడం, నిఘా పెట్టడం, పర్యవేక్షించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు.
• ఆపద సమయంలో ఎస్ఓఎస్(SOS)ని వినియోగించినప్పుడు మాత్రమే వారి లొకేషన్ ని కంట్రోల్ రూం ద్వారా గుర్తించడం జరుగుతుంది.
• భాదితులు ముందుగా నమోదు చేసుకున్నా బంధువులకు, స్నేహితులకు మాత్రమే అప్రమత్తం చేస్తూ సమాచారం చేరుతుంది.
• OTP అన్నది కేవలం భద్రతలో ఒక భాగం మాత్రమే... డబుల్ ధృవీకరణ (Double Authentication) ద్వారా వ్వక్తిగత సమాచార గోప్యత పరిరక్షించబడుతుంది.
• ఆపద లో ఉన్న మహిళలు, చిన్నారుల భద్రత కొరకు విజయవంతంగా సుమారు 10, 983 మందికి పైగా ఈ sos సౌకర్యాన్ని వినియోగించడం జరిగింది . ప్రధానంగా మహిళలు, చిన్నారుల పైన జరుగుతున్న దాడులు , భర్త వేదింపులు, అత్తింటి వేదింపులు, రోడ్డుపైన వెళ్తున్న సమయంలో పోకిరిల వేధింపులు, అదృశమైన కేసులు, అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం అందించడం జరిగింది.
*ఉదాహరణకు కొన్ని ఘటనలు..*
• ఓ చిన్నారి పైన గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారాయత్నానికి పాల్పడుతున్న సమయంలో 65 ఏళ్ల వృద్దురాలు ఎస్‌ఓఎస్ వినియోగించడం ద్వారా చిన్నారిని సురక్షితంగా రక్షించడం జరిగింది.
• విజయవాడ లో రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న ఓ విధ్యార్ధిని కొంతమంది పోకిరిలు వేదిస్తుండాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఎస్‌ఓఎస్ ద్వారా సమాచారం అందించడంతో ఆ విధ్యార్ధిని సురక్షితంగా రక్షించడం జరిగింది.
• మరో ఘటనలో ఒంటరిగా నిర్మానుషశ్యమైన అటవీ ప్రాంతంలో వాహనం పైన ప్రయాణిస్తున్న మహిళా టైర్ పంక్చర్ కావడంతో ఎస్‌ఓఎస్ ద్వారా సహాయాన్ని కోరడంతో అక్కడికి చేరుకొని ప్రత్నాయ ఏర్పాట్లతో మహిళను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం జరిగింది.
• పోలీసుల సత్వర సేవలో భాగంగా అత్యంత భద్రత ప్రమాణాలతో మీ రక్షణ కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన సురక్షిత మైన ఈ దిశ అప్లికేషన్ పైన ఎటువంటి అపోహలకు, సందేహాలకు తావులేకుండా నిర్భయంగా ఈ అప్లికేషన్ ను మీరు వినియోగిస్తూ.. మీ బందువులు, మిత్రులు దీనిని తమ సెల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని వినియోగించేలా వారిని చైతన్యపరిచాలని కోరుకుంటున్నాం.
• *జాతీయ స్థాయి* లో ఇప్పటి వరకు 19 అవార్డులు(Parliamentary Committee, MHA, NCRB, FICCI, Tech Sabha, SKOCH, Governance Now) దక్కించుకొని భద్రత ప్రమాణాలకు దీటుగా నిలిచింది.
addComments
Post a Comment