ఇళ్ల నిర్మాణాలపై పురోగతి సాధించాలి

 ఇళ్ల నిర్మాణాలపై పురోగతి సాధించాలి 


నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి


*: జిల్లా కలెక్టర్ బసంత కుమార్


పుట్టపర్తి ఏప్రిల్ 23 (ప్రజా అమరావతి):


*నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్ లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బ వసంత కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్ నందు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్ లలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద జిల్లాల్లో          42109మంజూరు కాగా, అందులో ఇంకా 11218 ఇల్లు మొదలు పెట్టాల్సి ఉందని, వెంటనే వచ్చేనెల 15 లోపు ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. ఇళ్లను గ్రౌండింగ్ చేసి త్వరితగతిన నిర్మాణాలను బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలన్నారు. అలాగే బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న, బేస్మెంట్ స్థాయిలో ఉన్న నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఎప్పటికప్పుడు స్టేజి అప్డేషన్ చేయాలన్నారు. రూఫ్ స్థాయిలో ఉన్న 16079ఇళ్లను, రూఫ్ క్యాస్ట్ లో ఉన్న 2,635 ఇళ్ల నిర్మాణాలను వచ్చే నెల 15 లోపు పూర్తిస్థాయిలో పూర్తిచేయాలన్నారు. కేటాయించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, లక్ష్యాలను చేరుకోలేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడం అన్నారు. ఇల్లు నిర్మాణ రంగంలో మన జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉండాలని అందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. వారానికి మూడు లే అవుట్లను సందర్శిస్తారని పేర్కొన్నారు. ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు సాయంత్రం నాలుగు గంటల పై సంబంధిత అధికారులతో మున్సిపల్ కమిషనర్లతో, హౌసింగ్ ఇంజనీర్లతో, సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, గృహ లబ్ధిదారులకు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ఖాతాను పొందే విధంగా గొప్ప మేళ నిర్వహించడం జరుగుతుందని అందుకు డి ఆర్ డి ఏ సిబ్బంది మెప్మా సిబ్బంది ఈ కార్యక్రమం పాల్గొనాలని  జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎంఐజీ ఇళ్ల పథకంకోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలి. 

జగనన్న వైఎస్ఆర్ కాలనీలకు కావాల్సిన సామాజిక, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.