రోజురోజుకి పెరుగుతున్న డీజిల్ ధరలు ---- విధిలేని పరిస్థితుల్లో డీజిల్ సెస్ విధింపు.
ప్రయాణికులు సహకరించి ఆర్టీసీని ఆదరించాలి.------ చైర్మన్ శ్రీ.ఏ. మల్లికార్జున్రెడ్డి, & ఎం.డి. శ్రీ సి.హెచ్. ద్వారకా తిరుమలరావు,. విజయవాడ (ప్రజా అమరావతి); ఐ.పీ.ఎస్. ఏ.పీ.ఎస్. ఆర్టీసీ సంస్థ గత 75 సంవత్సరాలుగా ప్రయాణికులకు అందుబాటు ధరలతో ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న సంగతి అందరికీ విధి తమే. మారుమూల ప్రాంత వాసులకు కూడా ప్రయాణ సౌకర్యాలు అందించడంలో ఆర్టీసీ సుస్థిర స్థానాన్ని సంపాదించింది. దూరప్రాంతాలకు కూడా సర్వీసులు నడుపుతూ అందరి మన్ననలు పొందoది. విరామం లేకుండా నిరంతరాయంగా ప్రతిరోజు 11,271 బస్సులతో 41 లక్షల కిలోమీటర్లు నడుపుతూ 45 లక్షల ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. కోవిడ్ కారణంగా మార్చి 2020 నుండి మార్చి 2022 వరకు సమస్త పై 5680 కోట్లు ఆదాయం తగ్గటం వలన రోజువారీ ఖర్చుల కారణంగా సమస్త పై భారం పడింది. కోవిద్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మారి సామాన్య ప్రజానీకం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని యోగించి ప్రయాణికులపై భారం వేయకూడదని భావనతో ఈ రోజు వరకు కూడా వారికి అదనపు భారం లేని ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఆర్టీసీ టికెట్ ధరలు చివరిసారిగా 11 డిసెంబర్ 2019 తేదీన పెరిగినవి. అప్పుడు లీటరు డీజిల్ ధర 67 రూపాయలు మాత్రమే. ఈ రోజు అనగా 13 4 2022 మార్కెట్లో లీటరు డీజిల్ ధర 107 రూపాయలు ఉన్నది. డిసెంబర్ 2019 నుండి ఇప్పటివరకు డీజిల్ ధర 40 రూపాయలు పెరిగినది. అంటే 60 శాతం ధర పెరిగినట్లు. ఏ.పీ.ఎస్.ఆర్టీసీ ప్రతిరోజు ఎనిమిది లక్షల హెచ్.ఎస్. డి. ఆ యిల్లు ను వినియోగిస్తుంది. పెరిగిన 60% డీజిల్ ధరలతో సంస్థపై ప్రతిరోజూ 3.2 కోట్లు అధికంగా ఆర్థిక భారం పడుతుంది. ఇది కాక, బస్సుల నిర్వహణలో అవసరమైన టైర్లు, స్పేర్ పార్టులు మొదలగు వాటి ధరలు విపరీతంగా పెరిగింది. దీన్ని అధిగమించేందుకు విధిలేని పరిస్థితులలో స్వల్పంగా చార్జీలు పెంచేందుకు రూపకల్పన చేయడం జరిగింది. ఇది ప్రయాణికులపై వేసే భారం కాదు, అత్యవసర డీజిల్ పై వేసే సెస్ మాత్రమే. ప్రజలు సహకరించాలని కోరుతున్నాము. డీజిల్ పెరుగుదల కారణంగా, ఏ.పీ.ఎస్. ఆర్టీసీ సెస్ చార్జి పెంచక తప్పడం లేదని గమనించాలి. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఒకో ప్రయాణికుని నుండి ₹2, ఎక్స్ప్రెస్, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ సర్వీసులలో ఐదు రూపాయలు, సూపర్ లగ్జరీ అండ్ ఏసీ సర్వీసులలో పది రూపాయలు వసూలు చేసేందుకు నిర్ణయించడం జరిగింది. ఈ రేట్లు రేపటి నుండి అమలులోకి వస్తాయి. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో కనీస ధర పది రూపాయలు గా ఉంటుంది. ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంత ప్రయాణం అందించడంలో ఆర్టీసీ ఎప్పుడూ ముందు ఉంటుంది. టికెట్ ధరల లో కలిగిన ఈ చిన్న మార్పునీ సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము..
addComments
Post a Comment