మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం



36,913 స్వయం సహాయక సంఘాల్లోని 3,87,867 మహిళలకు నేరుగా 56.55 కోట్ల రూపాయల వడ్డీ జమ.


మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం



**జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్**


కర్నూలు, ఏప్రిల్ 22 (ప్రజా అమరావతి):-


స్వయం సహాయక బృందాల మహిళల అభివృద్ధి చెంది మెరుగైన ఆర్థిక పరిస్థితి* *కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడవ విడత* *వైఎస్సార్ సున్నవడ్డీ పధకం అమలులోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని* *సామూన్ తెలిపారు. ఈ పథకం కింద నంద్యాల జిల్లా వ్యాప్తంగా అర్హత గల 36,913 స్వయం సహాయక సంఘాల్లోని 3,87,867 మంది అక్క చెల్లెమ్మలకు నేరుగా 56.55* *కోట్ల రూపాయల వడ్డీని వారి తరఫున పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలను బ్యాంకు* *ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసారని జిల్లా కలెక్టర్ తెలిపారు.* *గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఒంగోలులో 9.76 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మలు* *బ్యాంకులకు కట్టవలసిన రూ.1,261 కోట్ల వడ్డీని వారి తరపున పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల బ్యాంకు* *ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ల్యాప్ టాప్ బటన్ నొక్కి* *నేరుగా జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని లైవ్ ద్వారా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బ్రిజేంద్రనాథరెడ్డి, డిఆర్డిఏ ప్రాజెక్ట్ మేనేజర్ బి.శ్రీధర్ రావు, గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు వీక్షించారు. 


అనంతరం జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మూడవ విడత వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద 36,913 స్వయం సహాయక సంఘాల్లోని 3,87,867 మంది మహిళలకు నేరుగా 56.55 కోట్ల రూపాయల వడ్డీని వారి ఖాతాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జమ చేశారన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని 29,885 స్వయం సహాయక సంఘాలకు సంబంధించి 3,15,993 మంది మహిళల ఖాతాల్లో రూ. 46.45 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 7028 స్వయం సహాయక సంఘాలకు సంబంధించి 71,874 మంది మహిళల ఖాతాల్లో రూ. 10.10 వెరసి మొత్తం 56.55 కోట్ల రూపాయల వడ్డీని జమ చేయడం జరిగిందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రధాన లక్ష్యంతో మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.


2019-20 ఆర్థిక సంవత్సరంలో నంద్యాల* *జిల్లాలో 24,632 గ్రూపులకు 47.98 కోట్లు,  2020 - 21 ఆర్ధిక సంవత్సరంలో 28,775 పొదుపు సంఘాలకు*రూ .41.74 కోట్లు గతంలో జమ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన మూడవ విడత సున్నా వడ్డీ మొత్తాలను స్వయం సహాయక సంఘాల మహిళలు చక్కగా సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు.


Comments