వెలుగుబంద లేఅవుట్ లో జర్మన్ షేడ్ ఏర్పాటు చెయ్యండి



రాజానగరం, (ప్రజా అమరావతి);


వెలుగుబంద లేఅవుట్ లో జర్మన్ షేడ్ ఏర్పాటు చెయ్యండి 



క్షేత్రస్థాయిలో ఉండి  ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చెయ్యండి 

 

- కలెక్టర్ డా. కె. మాధవీలత 


నవరత్నాల్లో భాగంగా  పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని మరింత వేగవతం చెయ్యడం జరుగుతోందని,   రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా పథకం అమలు పై దృష్టి పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు..


శనివారం రాజానగరం మండలం వెలుగుబంద గ్రామ పరిధిలోని హౌసింగ్ లే అవుట్ల ను  నగరపాలక సంస్థ కమీషనర్ దినేష్ కుమార్ , హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత  మాట్లాడుతూ, మొత్తం ఈ లే అవుట్ పరిధిలో అత్యధిక స్థాయిలో ఇళ్ల స్థలాలు అందుబాటులో ఉన్నాయని, మొత్తం 68 ఇంజనీరింగ్ సహయకులను నియమించామన్నారు.  ఈ లే అవుట్ లో జర్మన్ షేడ్ ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయి నుంచి పనిచేయాల్సి ఉంటుందన్నారు. వేసవి దృష్ట్యా మరింత వేగంగా పనులు చెయ్యడం సాధ్యం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.  ఇక్కడ స్థలం పొందిన వారిచే ఇంటి నిర్మాణాలు వేగవంతం చెయ్యాల్సి బాధ్యత మీపై  ఉందన్నారు. ఇళ్ళ నిర్మాణాలు చేపట్టడంలో లబ్ధిదారులకు అవగాహన పెంచే దిశలో, క్షేత్ర స్థాయి సిబ్బందికి పరిపాలన సౌలభ్యం కోసం ప్రత్యేకంగా కార్యదర్సులను కూడా నియమించడం జరిగిందన్నారు. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు పథకం ద్వారా ఈ  లే అవుట్ లో తొలిదశలో ఆసక్తి చూపిన  6,156 మంది లబ్ధదారులకు మంజూరు ఉత్తర్వులు జారీచేశామన్నారు. రానున్నరోజుల్లో ఈ జగనన్నకాలనీ ఒక పెద్దమేజర్ పంచాయతీ గా  రూపుదిద్దుకోనున్నదన్నారు.

వివిధ దశల్లో ఉన్న   ఇంటి నిర్మాణాలను మరింత వేగవంతం చేసే దిశలో అడుగులు వేయాలన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక, ఇనుము, సిమెంట్ తదితర  ముడి సరుకులను ప్రభుత్వమే  అందుబాటులో ఉంచుతోందని, ఆర్థికంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేవలం ఈ లేఅవుట్ నందు ప్రస్తుతం 800 మంది ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్నారని, మిగిలిన వారితో కూడా ఇంటి నిర్మాణంప్రారంభింప చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 


 లబ్ధిదారులకు భరోసా కల్పించే ఉద్దేశంతో, ప్రతి 1000 లే అవుట్ లకి ఒక "యమీనిటీ  కార్యదర్శి" వారితో పాటు ఒక  చొప్పున ఆరుగురిని నియమించడం జరిగిందన్నారు. వెల్ఫేర్ కార్యదర్శి  కూడా పనులను మరింత వేగం పెంచే దిశలో క్షేత్ర స్థాయి లో నియమిస్తున్నట్లు స్పష్టం చేశారు. 


నగరపాలక సంస్థ కమీషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న లే అవుట్ లలో అతి పెద్ద లే అవుట్ గా వెలుగుబంద జగనన్న కాలనీ లే అవుట్ లో 13 వేలకు పైగా ఇండ్ల స్థలాలు ఉన్నాయన్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంటి నిర్మాణాలు పూర్తి అయితే ఒక చిన్న పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. మొత్తం 15 కాంట్రాక్టర్ లు ఇక్కడ ఇంటి నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. 


ఈ పర్యటనకు  హౌసింగ్ పిడి  బి. తారాచంద్,  అడిషనల్ కమిషనర్ సత్యవేణి,  హౌసింగ్ ఈ ఈ  జీ.సోములు, డీ ఈ లు, ఏ ఈ లు,  వర్క్ ఇన్స్పెక్టర్ లు తదితరులు హాజరయ్యారు.



Comments