రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూఉంది

 


చాగల్లు  (ప్రజా అమరావతి);


రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, ఆర్థిక సాధికారికత దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు.


మంగళవారం చాగల్లు లో కాకుల కళ్యాణ మండపంలో జరిగిన వాలంటీర్ సన్మాన కార్యక్రమం, చెక్కుల పంపిణీ కార్య్రమంలోముఖ్య అతిథిగా మంత్రి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 4,596 సంఘాలకు రు.45.51 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ ని అందించామన్నారు. కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలోని 4576 గ్రూపులో ఉన్న మహిళలకు రు.6.68 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ నేరుగా వారి బ్యాంకు ఖాతాకు జమ చేశామన్నారు.  చాగల్లు మండల పరిధిలోని 1469 మంది గ్రూపులకు రు.2.57 కోట్ల సున్న వడ్డీ రాయితీ గ్రూప్ సభ్యుల ఖాతాలో జమ చేశామన్నారు..


గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలవాలని, అర్హులకు అన్ని సంక్షేమ పథకాలను అందచెయ్య లని తానేటి వనిత పేర్కొన్నారు. వారి సేవలను గుర్తిస్తూ తగిన రీతిన సత్కరించిన సందర్భం గతంలో ఏ ఒక్క ప్రభుత్వ హయాంలో  ఎప్పుడు జరుగలేదని, కేవలం జగనన్న హాయంలో  అటువంటి గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపారు.


ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు  తదితరులు పాల్గొన్నారు.