అమరావతి (ప్రజా అమరావతి);
*పునర్‌వ్యవస్ధీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్*
*క్యాంప్ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్*
*ఈ సందర్భంగా మాట్లాడిన కొత్త జిల్లాల కలెక్టర్లు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*
*సుమిత్ కుమార్, జిల్లా కలెక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి...*
సార్ గుడ్ మార్నింగ్, ఈ రోజు మాకు సుదినం, మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. అల్లూరి సీతారామరాజు పేరుతో నూతన జిల్లా ఏర్పాటు చేయడం, ఈ జిల్లాకు మొదటి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం నాకు గర్వకారణంగా ఉంది. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించారు. ఈ జిల్లాలో పనిచేయడం ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటాను, నాకు ఇది మంచి అవకాశంగా కూడా భావిస్తున్నాను. గిరిజనులతో మమేకమై వారి జీవన విధానాన్ని మరింతగా మెరుగుపరిచేలా కృషిచేస్తాను. పరిపాలనా వికేంద్రీకరణ వలన ప్రజలకు మరింతగా చేరువయ్యే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు వలన ప్రజలు వారి సమస్యలను అధికారుల దృష్టికి త్వరితగతిన తీసుకువచ్చే అవకాశం
ఉంది. మేం ప్రజలకు అందుబాటులో ఉండి వారి ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరిస్తాం. మేం కష్టపడి పనిచేసి ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేస్తాం. మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, ధ్యాంక్యూ సార్ అని ముగించగా ప్రతీ వారంలో రెండు రోజులు మీరు రంపచోడవరంలో ఉండాలని సీఎం శ్రీ వైఎస్ జగన్ సూచించగా తప్పనిసరిగా ఉంటానని కలెక్టర్ అన్నారు.
*కే. విజయ, జిల్లా కలెక్టర్, బాపట్ల జిల్లా*
గుడ్ మార్నింగ్ సార్, కొత్త జిల్లాకు కలెక్టర్‌గా నాకు అవకాశం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ధ్యాంక్యూ సార్. ఒక చరిత్రలో నేను భాగస్వామినయ్యానని నేను భావిస్తున్నాను. బాపట్ల జిల్లా అభివృద్ది కోసం నేను కృషిచేస్తాను. మేం చిత్తశుద్దితో పనిచేసి మీ కలలను నిజం చేస్తాం, పరిపాలనా వికేంద్రీకరణ, ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలు, ప్రతీ ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు చేరవేయడంలో మా అధికారులంతా కూడా నిబద్దతతో పనిచేస్తాం. మీ ఆలోచనలకు ప్రతిరూపంగా జిల్లా అభివృద్దిలో భాగస్వాములవుతాం. ఇది మాకు ఛాలెంజ్‌గా తీసుకుని ముందుకెళతాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.
*కే. వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్, తిరుపతి జిల్లా*
సార్, ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యమవడం మేం గౌరవంగా భావిస్తున్నాం. తిరుపతి జిల్లాలో మహిళల శాతం ఎక్కవగా ఉంది, ఇలా ఉండడం వలన అభివృద్ది కూడా వేగంగా జరుగుతుంది. తిరుపతి జిల్లా ప్రజల తరపున మీకు ధన్యవాదాలు. ఇక్కడ పారిశ్రామిక అభివృద్దికి అవకాశం ఉండడంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. దీని వల్ల ఆర్ధికాభివృద్దికి అవకాశం ఉంటుంది. దీనిపై స్ధానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరించి జిల్లా అభివృద్దికి పాటుపడతాం. రాయలసీమకు మా జిల్లా ద్వారా సముద్రాన్ని దగ్గరకు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మెరైన్ డెవలప్‌మెంట్ చేసి జిల్లాను ముందుకు తీసుకెళతాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చాల్సిన భాద్యతను నెరవేరుస్తాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత వారి సమస్యలు ఎక్కడికక్కడే తీరుస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మరింతగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. ప్రజల సమస్యలు పరిష్కరించేలా ప్రతి ప్రభుత్వ అధికారి నిబద్దతతో పనిచేస్తాం. మేం ఈ కొత్త జిల్లాను అభివృద్ది బాటలో నడిపేందుకు పూర్తి సిద్దంగా ఉన్నామన్నారు, ఆ తర్వాత తిరుపతి జిల్లా ఎస్‌పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి పోలీస్ శాఖ పరంగా మంచి పేరు తీసుకొస్తానని, తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
addComments
Post a Comment