అక్కచెల్లెమ్మల ఆశీస్సులు, దీవెనలు జగనన్నకు తోడుగా ఉన్నాయి


అనకాపల్లి జిల్లా (ప్రజా అమరావతి);


*నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో సీఎం చేతుల మీదుగా ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం*


*ఈ సందర్భంగా మాట్లాడిన గృహనిర్మాణ శాఖ మంత్రి, లబ్ధిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*జోగి రమేష్, గృహనిర్మాణ శాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు ఈ రోజు, ఉత్తరాంధ్ర అక్కచెల్లెమ్మలకు, ఎప్పటినుంచో విశాఖ నగరం వచ్చి గూడు లేక, అద్దెలు కట్టలేని అక్కచెల్లెమ్మలకు జగనన్న గూడు కల్పించే గొప్ప కార్యక్రమం. అన్నా బలహీనవర్గాలు, బీదలు, పేదలందరికీ కూడా మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇళ్ళ స్ధలాలు ఇవ్వాలని, ఇళ్ళు కట్టించాలన్న మీ సంకల్పం, యజ్ఞం నెరవేరింది. ఇంతమంది అక్కచెల్లెమ్మల ఆశీస్సులు, దీవెనలు జగనన్నకు తోడుగా ఉన్నాయి


. ఈ కార్యక్రమం ఎప్పుడో జరగాలి కానీ కొంతమంది దుర్మార్గులు, రాక్షసులు, వెన్నుపోటుదారులు (నారా చంద్రబాబునాయుడు) కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి అక్కచెల్లెమ్మలకు ఇళ్ళస్ధలాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. అయినా భగవంతుడు, జనమంతా జగనన్న వెంట ఉండడంతో అనుకూలమైన తీర్పులు వచ్చాయి. ఈ రోజు 1.25 లక్షల మంది నిరుపేదలైన అక్కచెల్లెమ్మలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం ఇది. రెండు మూడేళ్ళలో ఈ పైడివాడ అగ్రహారం మున్సిపాలిటీగా మారబోతుంది, పట్టణంగా కూడా మారబోతుంది. మీరు కట్టేది కాలనీలు కాదు నేరుగా పట్టణాలు. మేమంతా మీ వెంట ఉన్నామన్నా...అన్నా సామాజిక న్యాయం మీరు చేశారు. మొత్తం మంత్రుల్లో 15 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు ఇచ్చి మమ్మల్ని తల ఎత్తుకు తిరిగేలా చేసిన జగనన్నకు పాదాభివందనం చేస్తూ జేజేలు పలుకుతున్నాం. 


*నవమణి, లబ్ధిదారు, గాజువాక*


అన్నా మాది పేద కుటుంబం, మాకు సొంతిల్లు కలగా ఉండేది. మీరు మా సొంతింటి కలను నెరవేర్చినందుకు మీకు ధన్యవాదాలు అన్నా, నాలాంటి పేదవారికి ఇల్లు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. నేను నా పిల్లలు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. అన్నా మేం అద్దెలు కట్టలేక కరోనా సమయంలో ఇబ్బందులు పడ్డాం, నాకు మీరు భరోసానిచ్చారు, నా ఇంట్లో నేను ధైర్యంగా బతికే ఆధారం మీరు ఇచ్చారు. అన్నా మీరు నేనున్నానంటూ తోడుగా నిలిచారు, నాకు వివిధ పథకాల ద్వారా సాయం అందింది. మీ అన్న మహిళా పక్షపాతి అంటారు, అవును నేను గర్వంగా చెప్పుకుంటాను. మమ్మల్ని ఈ స్ధాయిలో ఉంచిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

Comments