రుయాలో క్షతగాత్రులను పరామర్సించిన జిల్లా కలెక్టర్
తిరుపతి, ఏప్రిల్ 25 (ప్రజా అమరావతి):
తిరుపతి ఆటో నగర్ , చంద్రగిరి వాసులు నెల్లూరు జిల్లా కణుపూరు ముత్యాలమ్మ జాతర కు వెళ్లివస్తుండగా ఆదివారం రాత్రి స్వర్ణముఖి నది బ్రిడ్జి వద్ద లారీ , టాటా ఏస్ ఢీ కొన్న ప్రమాద బాధితులను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి సోమవారం ఉదయం రుయాలో పర్యటించి పరామర్సించి క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు వెంటనే స్పందించి చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఉదయం న్యూరో సర్జరీ ఇద్దరికీ చేస్తున్నారని అన్నారు. ప్రమాద బాధిలను ప్రభుతం అన్ని రకాల ఆదుకుంటుందని, మొత్తం 12 మంది ప్రయాణిస్తున్న వీరిలో ప్రమాదస్థలంలోనే మరణించిన ముగ్గురిని దగ్గరలోని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించామని అన్నారు. భాదితులను మెరుగైన చికిత్సకు రుయాకు తరలిస్తున్న సమయంలో దారిలో ఒకరు మరణించారు , బాగున్న ఒకరు ఇంటికి వెళ్లారు , మిగిలివారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు . ప్రమాదాల నివారణకు కారణాలు ఆర్ టి ఓ తరచూ సమీక్షలతో చర్యలుచేపట్టనున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో అర్జునయ్య 45 సం., ఆయన భార్య సరసమ్మ 40 సం., మారెమ్మ 43 సం., అక్కడికక్కడే మృతి చెందగా ధరణి 10 సం.అమ్మాయి రుయాకు తరలింపు సమయంలో మృతి చెందింది. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ 30 సం.( డ్రైవర్ కం ఓనర్ ), కవిత 28 సం., ధనుస్ 13 సం., గోపి 29సం., ఆనంద్ 30 సం., మోక్షిత 03సం., దిల్లిరాణి 19 సం., వారిలో వున్నారు. కలెక్టర్ పర్యటనలో రుయా సూపరింటెండెట్ డా భారతి , డి ఎం హెచ్ ఓ శ్రీహరి ,వైద్య అధికారులు , డిటి లు అశోక్ రెడ్డి , రామచంద్ర తదితరులు వున్నారు.
addComments
Post a Comment