సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.

 సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.* 


   కుణుత్తూరు, గ్రామ సచివాలయాల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


 

, కుణుత్తూరు,ఏప్రిల్ 29 (ప్రజా అమరావతి): ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్  ఆదేశించారు


శుక్రవారం కుణుత్తూరు, గ్రామ సచివాలయాల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*

ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్. ఎల్.ఏ. గడువులోగా ప్రజా సమస్యల పరిష్కారం నివేదిక తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. వచ్చే నెలలో ప్రభుత్వం అమలు చేసే పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ చేశారా లేదా అన్నది పరిశీలించారు. సంబంధిత అర్హుల జాబితాను ప్రతినెల సచివాలయంలో ప్రదర్శించాల న్నారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ ఎంతో కీలకమన్నారు. సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వర్తించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు. సచివాలయంలో ఆలస్యం లేకుండా ప్రజలకు పౌర సేవలు అందాలి అని, అవి కూడా ప్రజలు సంతృప్తి చెందే విధంగా నిర్ధిష్ట సమయంలో అందించడం ద్వారా సచివాలయ వ్యవస్థ మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఏ ఒక్క పౌర సేవలు నిర్దేశించిన కాలం దాటి రాదని పౌర సేవలు అందించడంలో ప్రజలకు సంతృప్తికరంగా ఉండేలా చూడాలన్నారు. సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ప్రతి నెలలో చివరి శుక్రవారం, శనివారం వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది చేపట్టి ప్రతి ఇంటికి వెళ్లాలన్నారు.వచ్చే నెలలో ప్రభుత్వం  చేపట్టనున్న కార్యక్రమాలను వివరించాలన్నారు.  ఖచ్చితంగా ప్రతి ఒక్కరు  డ్రెస్ కోడ్ పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మారం ఆర్డిఓ వరప్రసాద్, తాసిల్దార్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments