కాపులకు వెల్ల గ్రామంలో జగన్న కాలనీ ద్వారా తమ చిరకాల స్వప్నాన్ని సార్ధకత చేయడం


 

రామచంద్రపురం, (ప్రజా అమరావతి);



సుదీర్ఘకాలం పాటు కట్టుబాట్లు తో జీవించి ఒకే ఇంట్లో పెద్ద సంఖ్యలో కనీస సౌకర్యాలు లేని కాపులకు వెల్ల గ్రామంలో జగన్న కాలనీ ద్వారా తమ చిరకాల స్వప్నాన్ని సార్ధకత చేయడం సౌభాగ్యం గా భావిస్తున్నట్లు బీసీ సంక్షేమం సినిమాటోగ్రఫీ,సమాచార శాఖ మాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.



సోమవారం బిసి సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మాత్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ  రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో వైస్సార్ జగన్న శాశ్వత గృహ నిర్మాణాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

   

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెల్ల గ్రామంలో నివసిస్తున్న  వారికి 1994 సంవత్సరం నుండి ఇళ్లు ఇస్తామనే వాగ్దానం ఉన్నప్పటికీ సుదీర్ఘ కాలం గా అపరిష్కృతంగా ఉన్న సమస్యను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో నేడు నెరవేర్చుకోవడం  గృహ ప్రవేశం చేయడం ప్రభుత్వ పరిపాలనా దక్షతకు నిదర్శనంగా అభివర్ణించారు.

 పేదింటి వారూ సొంత ఇల్లు కోసం కన్న కలలు జగన్న హౌసింగ్ కాలనీ ల ద్వారా నేడు నెరవేరుతున్నాయి అన్నారు.


వెల్ల గ్రామంలో 250 మందికి సెంటున్నార భూమి ఇవ్వడం తోపాటు ఇల్లు కట్టుకోవడానికి అదనంగా సహాయం అందించడం జరిగిందన్నారు. వెల్ల గ్రామంలో సెంట్ భూమి ధర 10 నుండి 15 లక్షల రూపాయల విలువ ఉందన్నారు.


నిరంతరం శ్రమిస్తూ పేదవారికి సేవ చేయాలని తలంపుతో ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రోత్సహంతో నేడు శాశ్వత గృహంలో గృహప్రవేశం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు

లబ్ధిదారుల ఆనందం వెలకట్టలేనిదని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు..


 ఈ సందర్భంగా మంత్రి గ్రామంలో పనిచేస్తున్న వాలంటీర్ల గురించి అరా తీసి వారి పని తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో వాలంటీర్లు హాజరు కాకపోవడం పట్ల గ్రామ సెక్రెటరీ ని ప్రశ్నించి ఇష్టం లేకపోతే వాలంటీర్లను తొలగించడం జరుగుతుందన్నారు.


ఈ సందర్భంగా మంత్రి గ్రామంలో వరసిద్ధి వినాయక క్లస్టర్ స్థాయి CHC గ్రూప్ కు 25 లక్షల రూపాయల విలువ కలిగిన వరికోత యంత్రాన్ని అందించారు.


అనంతరం మంత్రి చోడవరం చేరుకొని గ్రామంలో శివాలయం ధ్వజస్తంభం పనులు పరిశీలించి, అక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు. గ్రామస్థుల కోరిక మేరకు దేవాలయం వద్ద వాటర్ ప్లాంట్ కు సహకారం అందించడం జరుగుతుందన్నారు.


చోడవరం గ్రామంలో 1929 సంవత్సరం లో మహాత్మాగాంధీ విచ్చేసిన పురాతన భవనాన్ని దర్శించుకున్నారు.


అనంతరం కాజులూరు వెళుతూ మార్గ మధ్యలో  ఉండూరు- చెదువాడ వద్ద జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులు  మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరిశీలించారు.

Comments