కొవ్వూరు డివిజన్ పరిధిలో ప్రారంభంకానున్న సర్వే

 


కొవ్వూరు : ( ప్రజా అమరావతి);


కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం కేంద్రంగా సర్వే ఆఫ్ ఇండియా ద్వారా  సర్వే పాయింట్ గుర్తింపు


కొవ్వూరు డివిజన్ పరిధిలో ప్రారంభంకానున్న సర్వే




డిప్యూటీ తహసీల్దార్ (రీసర్వే ) గా డిటి లకు ప్రత్యేక అధికారములు..


...  ఆర్డీవో ఎస్. మల్లిబాబు


జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం రీ సర్వే కోసం జియో ఖాన్ సర్వే/ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ల ఆధ్వర్యంలో కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం ను  గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ గా తీసుకోవడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి  ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. 



గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయం లో సర్వే పాయింట్ గుర్తించడం సర్వే, రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లా డుతూ,  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం అమలులో వివాదాల పరిష్కారం లో భాగంగా క్షేత్ర స్థాయిలో డ్రోన్ సర్వే చేస్తున్నామన్నారు. డ్రోన్ ద్వారా భూముల వివరాలు గుర్తించి, వాటిని నిర్ధారణ చెయ్యడం వలన  త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.  ఇప్పటికే డిప్యూటీ తహశీల్దార్ లు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, మండల మొబైల్ మేజిస్ట్రేట్ అధికారములు కలిగి ఉన్నారు.  ప్రస్తుత ఉత్తర్వులు నేపథ్యంలో డిప్యూటీ తహశీల్దార్ రీసర్వే ఏపీ రీసర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 అధికారములు, ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ మరియు పట్టాదారు పాస్ బుక్ 1971 మరియు 1989 మేరకు నమోదు అధికారములు కల్పించడం జరిగిందని మల్లిబాబు తెలిపారు. సెంట్రల్ యాక్ట్ 2 ఆఫ్ 1974 అనుసరించి  కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 లో నిర్దేశించిన అధికారములు డిటి లకు కల్పించడం జరిగిందన్నారు. ఈ సర్వే వలన మన భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో భూసమస్యలు రాకుండా అరికట్టడం సాధ్యం అవుతుందన్నారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీఇన్స్పెక్టర్ (సర్వే) రామకృష్ణ, ఏఓ జవహర్బాజీ, జియో ఖాన్ సర్వే బృంద సభ్యులు పాల్గొన్నారు.

Comments