నేషనల్ జుడీషియల్ ఇన్ప్రాస్ట్రక్చర్ అధారిటీ ఆఫ్ ఇండియా అంశాలపై సిఎస్ సమీక్ష

 నేషనల్ జుడీషియల్ ఇన్ప్రాస్ట్రక్చర్ అధారిటీ ఆఫ్ ఇండియా అంశాలపై సిఎస్ సమీక్ష


అమరావతి,28 ఏప్రిల్ (ప్రజా అమరావతి):నేషనల్ జుడీషియల్ ఇన్ప్రాస్ట్రక్చర్ అధారిటి ఆఫ్ ఇండియాకు సంబంధించి వివిధ అంశాలపై గురువారం అమరావతి సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ న్యాయాధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి వీడియో సమావేశం ద్వారా వెంకటరమణ తదితర రిజిష్ట్రార్లు పాల్గొని నేషనల్ జుడీషియల్ ఇన్ప్రాస్ట్రక్చర్ అధారిటి ఆఫ్ ఇండియాకు సంబంధించిన పలు అంశాలను సిఎస్ దృష్టికి తెచ్చారు.వాటిలో ప్రాధాన్యతతో కూడిన అంశాలను త్వరగా పరిష్కరించాల్సి ఉందని చెప్పారు.ఆ అంశాల్లో ప్రధానంగా ఎపి జుడీషియల్ ఎకాడమీ ఏర్పాటు,స్టేట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ భవనం,వివిధ జిల్లాల్లో మంజూరైన స్పెషల్ కోర్టులకు భవనాలు,ఇతర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను రిజిష్ట్రార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తెచ్చారు.

అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ నేషనల్ జుడీషియల్ ఇన్ప్రాస్ట్రక్చర్ అధారిటి ఆఫ్ ఇండియాకు సంబంధించిన వివిధ అంశాల ప్రగతిని ప్రతి సోమవారం న్యాయశాఖ కార్యదర్శి తనకు వివరించాలని చెప్పారు.

ఈసమావేశంలో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి(సర్వీసెస్)హెచ్.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    

Comments