బ్యారేజి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలి

 నెల్లూరు, (ప్రజా అమరావతి);


మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజి  నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ప్రారంభించుకోనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రి శ్రీ  కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

                

ఆదివారం ఉదయం మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, ఇరిగేషన్  శాఖ అధికారులతో  కలసి  సంగం బ్యారేజి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి,  బ్యారేజి  నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాల


ని అధికారులను,  సంబందిత  నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఈ సంధర్భంగా మంత్రి శ్రీ  గోవర్ధన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ, సంగం బ్యారేజి నిర్మాణం జిల్లా ప్రజానీకానికి ఒక కల లాంటిదని,  రానున్న మూడు  నెలల్లో పూర్తి చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు  జలయజ్ణంలో  భాగంగా  2008 సంవత్సరంలో  ఈ బ్యారేజి నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. 325 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మిస్తున్న   ఈ బ్యారేజి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని,  మే నెలాఖరు నాటికి సివిల్ వర్క్స్,  జూన్ నెలాఖరు నాటికి మెకానికల్ వర్క్స్ పూర్తి చేసి రానున్న మూడు నెలల కాలంలో నిర్మాణ పనులు పూర్తి చేసేలా నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. 2019 సంవత్సరం నుండి  బ్యారేజి నిర్మాణ పనులు వేగవంతమైనాయని,  కోవిడ్ కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికినీ  ఈ మూడు సంవత్సర కాలంలో సుమారు 106 కోట్ల రూపాయల పనులు జరిగాయని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి  తెలిపారు.  ఇప్పటివరకు 95 శాతం పనులు  పూర్తికావడం జరిగిందని మంత్రి వివరించారు.   ఈ ప్రాంతానికి చెందిన  దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి  ఈ రోజు మద్య లేకపోయినా,  ఈ బ్యారేజి నిర్మాణానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ  జగన్ మోహన్ రెడ్డి గారు  ఈ బ్యారేజికి  మేకపాటి గౌతమ్ రెడ్డి  సంగం బ్యారేజి అని పేరు ప్రకటించడం జరిగిందని మంత్రి తెలిపారు. జలయజ్ణం కార్యక్రమాన్ని తీసుకోవచ్చి  సాగునీటి  ప్రొజెక్ట్స్ నిర్మాణాల ప్రధాత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని, ఈ బ్యారేజి నిర్మాణానికి కృషి చేసిన  ఈ ప్రాంత శాసన సభ్యులు, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాన్ని   పెన్నా డెల్టా ఆధునీకరణలో భాగంగా  ఈ బ్యారేజి నిర్మాణం వద్ద  ఏర్పాటు చేసి, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల  మీదుగా  ప్రారంభించడం జరుగుతుందని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.   జిల్లాలో  ప్రతి పంటకు సాగు నీరు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

                

మంత్రి శ్రీ  గోవర్ధన్ రెడ్డి వెంట  తెలుగుగంగ సి.ఈ  శ్రీ హరినారాయణ రెడ్డి,   ఇరిగేషన్ ఎస్.ఈ శ్రీ కృష్ణమోహన్,  వ్యవసాయ శాఖ జె.డి శ్రీ సుధాకర రాజు,  పొదలకూరు జ.పి.టి.సి శ్రీమతి నిర్మలమ్మ,  సంగం, పొదలకూరు మండల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments