రాజమహేంద్ర వరం (ప్రజా అమరావతి);
నగర పాలక సంస్థ స్పందనలో 13 ఫిర్యాదులు
కమిషనర్ కె. దినేష్ కుమార్
ప్రతి అర్హమైన ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని అధికారులను నగర పాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ ఆదేశించారు.
సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులను ఆయన స్వీక రించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ,
స్పందన ఫిర్యాదుల పరిష్కరించడంలో పారదర్శకత ఉండాల ని నగర పాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు 13 మంది నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. ప్రజా సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. వొచ్చే ఫిర్యాదులను సంబందించిన వార్డు ప్రత్యేక అధికారి మార్గ నిర్దేశంలో కార్యదర్శి పరిష్కారం చూపాలన్నారు.
స్పందన కార్యక్రమం సంబంధించిన నగర పాలక సంస్థ అధికారులు,అదనపు మునిసిపల్ కమీషనర్ పి. వి. సత్యవేణి, ఇంజనీరింగ్ ఇతర అధికారులు పాండురంగా రావు, సూరజ్ కుమార్, సాంబశివరావు, డా.వినూత్న, , వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment