ఇంటర్ విద్యార్ధులు 4390 మంది , ఓకేషనల్ విద్యార్థులు 714 మంది హాజరయ్యారు



కొవ్వూరు (ప్రజా అమరావతి):  


కొవ్వూరు డివిజన్  రెండవ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 4390 మంది , ఓకేషనల్ విద్యార్థులు 714 మంది  హాజరయ్యార


ని రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు.


శనివారం  స్థానిక టౌన్ బాలుర జూనియర్  కాలేజీ   పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, డివిజన్ పర్డిలోని 17 పరీక్షా కేంద్రాల లో ఇంటర్ రెండవ సంవత్సరం కోసం 4517 మంది, ఒకేషనల్ కోర్సు రెండవ ఏడాది పరీక్షలకు 773 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.



కొవ్వూరు డివిజన్ పరిధిలో పరిధిలో ఉన్న 17  కేంద్రాలలో రెండవ ఏడాది ఇంటర్ పరీక్షలకి 4,517 మందికి గాను 4,396 మంది హాజరు కాగా 121 మంది హాజరు కాలేదన్నారు.  ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 773 కి గానీ మందికి గాను 714 మంది హాజరు కాగా 59 మంది హాజరు కాలేదని తెలిపారు.  పరీక్షా కేంద్రాల్లో కి సెల్ ఫోన్లు అనుమతించడం లేదని తెలిపారు.


Comments