ఉదయం 8 గంటలకల్లా ఆరోజు పనులు నివేదిక ఇవ్వాలి

 ఉదయం 8 గంటలకల్లా ఆరోజు పనులు నివేదిక ఇవ్వాలి


ఉపాధి కూలీల సంఖ్య పెంచండి


జిల్లా కలెక్టర్    బసంత కుమార్




కొత్తచెరువు, లోచర్లమే 2 (ప్రజా అమరావతి):


జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు  కల్పించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్   బసంత కుమార్ అన్నారు.


సోమవారం పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్త  చెరువు మండలంలోని, లోచర్ల జరిగే ఉపాధి హామీ పనులు నుపరిశీలించారు. , క్షేత్రస్థాయిలో పనులు ఏమేమి ఉన్నాయో తెలుసుకొని అందుకు అనుగుణంగా ఆయా పనులకు ప్రాధాన్యత ఇస్తే సక్సెస్ సాధించగలన్నారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు.  పనులకు వచ్చేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ ఏడాది మహిళా మేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, అనంతరం కూలీలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కూలీలంతా ఉదయం ఆరుగంటలకే ఉపాధి పనులకు రావాలన్నారు. ఎంతవరకు పని చేస్తే అంతవరకు డబ్బులు వస్తాయన్నారు. గత వారం ఉపాధి పనులు చేసిన కూలీలు వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేస్తే వారం రోజుల్లోపు అందరికీ కూలీ డబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. పనులకు సంబంధించి కేటాయించిన కొలతలను తక్కువ కాకుండా పనులు చేపట్టాలన్నారు. వేసవి కాలం నేపథ్యంలో ఉపాధి పనులు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి కూలీలు ఉపాధి పనులకు ఉదయం సమయంలో, సాయంత్రం సమయంలో కూడా పనులు చేపట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో  సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments