మొదటి ఏడాది ఇంటర్, ఒకేషనల్ పరిక్షలకి 94.93 శాతం మంది విద్యార్థులు హాజరు .



కొవ్వూరు (ప్రజా అమరావతి) :  



జిల్లాలో ఈరోజు మొదటి ఏడాది ఇంటర్, ఒకేషనల్ పరిక్షలకి 94.93 శాతం మంది విద్యార్థులు హాజరు .


. కలెక్టర్ మాధవీలత


ఇంటర్మీడియేట్ మొదటి  సంవత్సరం 

గణితం పేపర్- I B జువాలజీ పేపర్-I చరిత్ర పేపర్-I పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 14,165 మంది (97.55%), ఓకేషనల్ విద్యార్థులు  1,766 మంది (86.15%) పరీక్షకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత తెలియచేశారు.


శుక్రవారం కొవ్వూరు శ్రీమతి అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని  జిల్లా కలెక్టర్ మాధవిలత సందర్శించారు.


ఈ సందర్భంగా కలెక్టర్  మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల లో ఇంటర్ మొదటి సంవత్సరం  పరీక్షా కోసం 14,521  మంది, ఒకేషనల్ కోర్సు మొదటి ఏడాది పరీక్షలకు  2050 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రాజమండ్రి డివిజన్ పరిధిలో 32 కేంద్రాలలో ఇంటర్ కి  10,692  మందికి గాను 10,489 మంది హాజరు కాగా 212 మంది హాజరు కాలేదన్నారు.  ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 1,226 కి గానీ మందికి గాను 1,057 మంది హాజరు కాగా 169 మంది హాజరు కాలేదని తెలిపారు.


కొవ్వూరు డివిజన్ పరిధిలో పరిధిలో 17  కేంద్రాలలో ఈరోజు ఇంటర్ పరీక్షలకి 3,829 మందికి గాను 3,685 మంది హాజరు కాగా 144 మంది హాజరు కాలేదన్నారు.  ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 824 కి గానీ మందికి గాను 709 మంది హాజరు కాగా 115 మంది హాజరు కాలేదని తెలిపారు.  పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ను పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన మందుల వివరాలను తెలుసుకున్నారు.


కలెక్టర్ వెంట ఆర్డీవో ఎస్. మల్లిబాబు, తహశీల్దార్ బి. నాగరాజు నాయక్, తదితరులు ఉన్నారు.

Comments