విజయవాడ, (ప్రజా అమరావతి);
*ఆంధ్ర ప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కొరకు APRJC-DC ప్రవేశ పరీక్ష..
*ఈనెల 20వ తేదీ లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..
*ఈనెల 18, 19 తేదీలలో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్పులు, చేర్పులకు అవకాశం..
-కన్వీనర్ జె. సోమదత్త..
ఆంధ్ర ప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు APRJC.DC ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని APRJC.DC.CET కన్వీనర్ జె. సోమదత్త ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష వ్రాయగోరే విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను https://aprs.apcfss.in ద్వారా ఈనెల 20వ తేదీ లోగా దరఖాస్తులను సమర్పించాలని అయన తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయు అభ్యర్థులు ప్రవేశ రుసుం చెల్లించిన తర్వాత వచ్చే గుర్తింపు సంఖ్యతో దరఖాస్తును పూర్తిగా నింపాలని అయన తెలిపారు. దరఖాస్తు రుసుం చెల్లించినంత మాత్రాన దరఖాస్తు సమర్పించినట్లు కాదని దరఖాస్తును పూర్తిగా నింపాలని అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఇప్పటివరకు దరఖాస్తు సమర్పించిన అభ్యర్థులు వారి వ్యక్తిగత వివరాలలో ఏమైనా మార్పులు చేయవలసి వస్తే సరిదిద్దుకోవడానికి ఈనెల 18, 19 తేదీలలో మాత్రమే అవకాశం కల్పించబడుతుందని ఇటువంటి అభ్యర్థులు అదే వెబ్ సైట్ లో వారి దరఖాస్తును ఓపెన్ చేసి సరి అయిన వివరాలు నమోదు చేసిన పిమ్మట దరఖాస్తును సమర్పించాలని కన్వీనర్ జె. సోమదత్త ఒక ప్రకటనలో తెలిపారు.
addComments
Post a Comment