ఆరోగ్యమే మహాభాగ్యం



*ఆరోగ్యమే మహాభాగ్యం


*


*ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష**


కడప,మే 1 (ప్రజా అమరావతి): ఆరోగ్యమే మహాభాగ్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు ఆర్యోగ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  ఎస్. బి అంజాద్ బాషా అన్నారు.


ఆదివారం నగరంలోని విద్యా సాగర్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నగర మేయర్ కె. సురేష్ బాబు,కమలాపురం ఎమ్యెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తో కలసిరాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష  ప్రారంభించారు.


ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  మాట్లాడుతూ....ఎముకలు ,కీళ్ల నొప్పులకు నిపుణులు డా. విద్యా సాగర్ నగరంలోని ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు సేవ చేయడం హర్షించ దగ్గ  విషయం అన్నారు. ఆర్థ్రరైటీస్ వ్యాధులతో   ఇబ్బందులు పడుతున్న వారికి అధునాతన నావిగేషన్ పద్దతిలో  వైద్య సేవలు  అందజేయడం అభినందనీయమని అన్నారు.


అలాగే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి  ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి   మరింత ప్రాధాన్యత కల్పించి   పెద్దపీట వేస్తూ రూ.1000లు  దాటిన  ప్రతి ఒక్కరికీ,అలాగే దాదాపుగా 2600 పైగా సేవలను, ఆరోగ్యశ్రీ పథకం కిందకి చేర్చారన్నారు.కీళ్ల ఆపరేషన్స్ లను కూడా ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకొని వచ్చే విదంగా  ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.  రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలని ప్రజలు ఆశీస్సులు అందించాలన్నారు.


పట్టణ ప్రజలు ఈ ఉచిత క్యాంపు శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని  ఆరోగ్య వంతులుగా ఉండాలని  ఆకాంక్షించారు 


ఈ కార్యక్రమంలో  కార్పొరేటర్లు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, విద్యాసాగర్ హాస్పిటల్ సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు


Comments