రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
ఘనంగా భగీరథ జయంతి వేడుకలు
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి దివీ నుండి భువికి గంగను రప్పించిన గొప్ప వ్యక్తి భగీరథుడు అని జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు పేర్కొన్నారు.
ఆదివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్దఉన్న బిసి స్టడీ సర్కిల్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్వో బి.సుబ్బారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భగీరథ మహర్షి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. గంగ కోసం తపస్సు చేసి ఆకాశం నుండి భూమికి గంగా ను తీసుకుని రావడం జరిగిందన్నారు. భగీరథ సంకల్ప దీక్ష నుంచి యువత ఎంతో నేర్చుకుని, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈరోజు ఆయన జయంతి జరుపుకుంటున్నామని తెలిపారు. లక్ష్య సాధన కోసం పట్టుదల కలిగిన వ్యక్తి అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దివి నుండి భువికి గంగను లోక కల్యాణం కోసం తెచ్చిన మహానుభావుడు అన్నారు. ఆయన పట్టుదలకు మారు పేరని, అందుకే ఆయన అపర భగీరథుడు గా పేరొందారన్నారు. ఆ మహానుభావుని స్ఫూర్తిగా ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు అందరూ ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించి తమ లక్ష్యాన్ని చేరుకునే దిశలో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.
బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి పి. సత్య రమేష్, సగర కార్పొరేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, జిల్లా వార్డెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృపారావు, పలువురు వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment