విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ పి . బసంత్ కుమార్విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ పి . బసంత్ కుమార్


శ్రీ సత్య సాయి జిల్లా , మే 7 (ప్రజా అమరావతి); 

విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి .బసంత కుమార్ హెచ్చరించారు. శనివారం ఉదయo

కొత్తచెరువు శ్రీ సత్య సాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మాత్తుగా  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటుచేసిన మౌలిక వసతుల గురించి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో  విధులు నిర్వహిస్తున్న వారు మరియు  విద్యార్థులు పరీక్షల నిబంధనలను ఉల్లంఘించరాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ పై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రశ్నపత్రాల బండి లను సీసీ కెమెరాల ఎదుటనే విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ చంద్రమౌళి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ శ్రీనివాస్ లను కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం పరీక్ష కేంద్రంలో ఈరోజు జరిగిన జనరల్ సబ్జెక్టు పరీక్షకు 339 మందికి గాను 330 మంది హాజరు కాగా ఇందులో 9 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 112 మందికి గాను 103 మంది హాజరు కాగా 9మంది విద్యార్థులు జై హాజరయ్యారు. నేటి ఉదయం జరిగిన పరీక్షలో ఉమ్మడి జిల్లా లకు సంబంధించి జనరల్ విద్యార్థులు మొత్తం 29 706 విద్యార్థులు కాగా 28 605 విద్యార్థులు హాజరయ్యారు ఇందులో  1101 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సు కు సంబంధించి 3125 మంది విద్యార్థులు కాగా 2941 మంది విద్యార్థులు హాజరు కాగా 184 మంది విద్యార్థులు హాజరయ్యారు.