రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
ఆదివారం శ్రమదాన్.. గోదావరి ప్రక్షాళన కార్యక్రమానికి విశేష స్పందన
పాల్గొన్న కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది
రానున్న రోజుల్లో వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నిర్వహిస్తాం
.. దినేష్ కుమార్
రాజమహేంద్రవరం రానికి, తూర్పు గోదావరి జిల్లాకు తలమానికమైన గోదావరి నది, ఘాట్స్, నది తీరప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం లో స్వచ్ఛందంగా తరలి వచ్చి స్ఫూర్తి నింపాలని నగరపాలక సంస్థ మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఆదివారం ఉదయం పుష్కర్ ఘాట్, గోదావరి నది లో చెత్త తొలగించే స్వచ్ఛత కార్యక్రమంలో ఆయన పాల్గొని, చెత్త తొలగింపు పనుల్లో భాగస్వామ్యం అయ్యారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, గోదావరి నది పవిత్రతను కాపాడడం లో ఎవరికి వారు స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావలసి ఉందన్నారు. గోదావరి నది, ఘాట్స్ లలో చెత్త తొలగింపు శ్రమదానం ఇక రానున్న రోజుల్లో గోదావరి ప్రక్షాళన ను ఒక ఉద్యమంలా చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి నగర పాలక సంస్థ ను. రోల్ మోడల్ గా నిలుపుదాం అన్నారు.
రాష్ట్రంలో పెరున్న గొప్ప నదుల్లో గోదావరి ప్రథమ స్థానంలో నిలుస్తుందని, ఈజీవ నది జిల్లాలో ప్రవహిస్తూ, ఇక్కడి పంటలను సస్యశ్యామలం చేస్తున్నట్లు , ప్రజల దాహార్తి ని తీరుస్తునట్లు దినేష్ కుమార్ పేర్కొన్నారు. అటువంటి నదీ జలాల ను కలుషితం కాకుండా చూడాలని, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం లేకుండా ఇది సాధ్యం కాదన్నారు.
ప్రజల్లో స్ఫూర్తి నింపి ఎవరికి వారు భాగస్వామ్యం కావాలని దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆ మేరకు ఆదివారం పెద్ద ఎత్తున అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొనడం అభినందనీయం అన్నారు. ఇటువంటి సమాజ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి నింపడం ప్రతి ఒక్కరి భాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎంసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment