కొండలు, గుట్టల్లో నడిచి వెళ్లి ఉపాధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్*
*: ఎక్కువ మంది కూలీలు పనులకు రావాలి*
*: ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి*
*రూ.257 డబ్బులు వచ్చేలా కూలీలు ఉపాధి పనులు చేయాలి*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
నల్లమాడ, కదిరి మండలం ముత్యాల చెరువు (శ్రీ సత్యసాయి జిల్లా) మే 20 (ప్రజా అమరావతి):
*శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ నల్లమాడ, మండలాల్లో కొండలను, గుట్టలను లెక్కచేయకుండా కాలినడకన వెళ్లి ఉపాధి హామీ పనులను పరిశీలించారు. శనివారం నల్లమాడ మండలంలోని గోపేపల్లిలో, కదిరి మండలం ముత్యాలచెర్వు గ్రామ పంచాయితీ వై.కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్నఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కూలీల్లో మనోధైర్యం నింపారు. ఉపాధి పనుల పట్ల, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల పట్ల కూలీలకు జిల్లా కలెక్టర్ తెలియజేశారు.*
*ఈ సందర్భంగా ఆయా మండలాల ఉపాధి కూలీలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఉపాధి పనులను కూలీలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనులకు రావాలన్నారు. వలసల నివారణ కోసం ఉపాధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. ప్రతిరోజు ఇచ్చే 257 రూపాయల కూలీ డబ్బులు వచ్చేలా ఉపాధి పనులను చేపట్టాలని పేర్కొన్నారు. ఎక్కువ పనిని చేపట్టడం ద్వారా పూర్తిస్థాయిలో కూలీ డబ్బులు పొందవచ్చన్నారు. అందుకోసం కూలీలంతా ఉదయాన్నే పనులకు వచ్చి ఎక్కువ పని చేయాలన్నారు. ఉపాధి హామీ పనులపై కూలీలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకి సూచించారు. కూలీలకు వంద రోజుల పాటు పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ వరకు ఉపాధి పనులు ఎక్కువ చేసేందుకు అవకాశం ఉంటుందని, ఆ మేరకు ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించాలన్నారు. అధిక సంఖ్యలో కూలీలు ఉపాధి పనులకు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కూలీల మస్టర్ లను తనిఖీ చేశారు. అనంతరం
కదిరి మండలం ముత్యాలచెర్వు గ్రామ పంచాయితీ వై.కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాది హామీ పథకం పనులను గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ బసంత్ కుమార్ గారు పరిశీలించారు, కలెక్టర్ గారు కూలీలతో మమేకమై వారితో ఉపాది పనులు చేస్తున్న విధానము, కూలీ గిట్టుబాటు, తదితరాలు అడిగి తెలుసుకున్నారు . అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్ పి కుంట నందు తిమ్మమ్మ మర్రిమాను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో నల్లమాడ ఇన్చార్జి తాసిల్దార్ దేవేందర్ నాయక్, ఎంపీడీవో కె పోలప్ప. ఏ పీ ఓసూర్యనారాయణ , కదిరి ఎమ్మార్వో.గోపాలకృష్ణ, యం.డి.ఓ. శ్రీమతి కె.సుధామని, సర్పంచ్ శ్రీమతి శుభలేఖ, ఈ.ఓ.ఆర్.డి వెంకటేసులు,ఏ.పి.ఓ ఆదెప్ప, ఉపాది కూలీలు పాల్గొన్నారు.
addComments
Post a Comment