అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలి.*
** అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి.*
* *జిల్లా కలెక్టర్ బసంత కుమార్
పుట్టపర్తి, మే 16 (ప్రజా అమరావతి): ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన "స్పందన" కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ బసంత కుమార్ ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్ వినతులు స్వీకరించారు. కలెక్టర్ తో పాటు డిఆర్వో గంగాధర్ గౌడ్, ఆర్డిఓ భాగ్యరేఖ ,స్పందన తాసిల్దార్ అనుపమ, పలుశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలు వచ్చిన విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీల పరిష్కారం, ఇచ్చే సమాధానం నాణ్యతతో ఉండాలన్నారు. స్పందనకు వచ్చే అర్జీలు రీఓపెన్ కాకుండా గ డువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన స్పందన పోర్టల్ ద్వారా.. ప్రజా సమస్యలను మరింత సులభతరంగా, నాణ్యతతో పరిష్కరించడంతో పాటు.. పరిష్కార నివేదికను కూడా సంబందిత పోర్టల్లో పొందుపరచాలని అధికారులను ఆయన ఆదేశించారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. సంక్షేమ పథకాలు, హాస్పిటల్అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులు తమకు ఇచ్చిన లక్ష్యాల మేరకు ఫలితాలను సాధించాలన్నారు. ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమం లో వివిధ సమస్యలపై 144వినతులు స్వీకరించడం జరిగింది.
*కొవిడ్ ప్రొటోకాల్ ను విధిగా పాటించాలి* :
*ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోనందున ... అధికారులు, వారి సిబ్బంది, ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ ... తరచుగా సానిటైజర్ తో కానీ సబ్బుతో కానీ చేతులను శుభ్రం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించడం ద్వారా తమతో పాటు ఇతరులను కూడా కొవిడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చునన్నారు. అనంతరం అర్జీదారులనుండి వారు అర్జీలను స్వీకరించారు*.
*స్పందన ద్వారా.. ప్రజల నుండి అందిన విజ్ఞప్తులలో కొన్ని..*..
1) పెనుగొండ మండలం, శెట్టిపల్లి గ్రామంలో నివసించు A. అశ్వతమ్మ అను నేను సర్వే నంబర్110-1 సుమారు 150 సెంట్లు భూమి కలదు వివిధ పంటల పెట్టి సాగు చేస్తున్నాంని. ప్రస్తుతం భూమిపై మేము హక్కుదారుగా కలిగి ఉన్నాము. మా భూమి కి1-B కి అడంగల్ మరియు పట్టాదార్ పాస్ పుస్తకంమంజూరు చేయవలసిందిగా వినతులు అందజేశారు.
2) కప్పల బండ పొలము నందు మా పూర్వీకుల ఆస్తి నాకు సంక్రమించింది 3.33 ఎకరాలభూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. 1961 వ సంవత్సరము నందు భాగ పరిష్కారం కొరకు మా భూమిని పరిష్కరించడం జరిగింది. కొందరు పెద్దలు మా భూమి పైన దురాక్రమణ చేయుటకు ప్రయత్నించు చున్నారు. సమగ్రంగా మా భూమి సర్వే చేపించి మాకు న్యాయం చేయవలసిందిగా డి . శ్రీనివాసులు వినతులనుఅందజేశారు.
3. సయ్యద్ మోదిన్ సాహెబ్ అను నేను పట్టు పరిశ్రమ శాఖ నందు ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించడం జరిగింది 2016 సంవత్సరంలో పదవి విరమణ చేపట్టడం జరిగింది నేటి వరకు పెన్షన్ మంజూరు రాలేదు నాకు పెన్షన్ అనంతపురం సబ్ట్రెజరీ కార్యాలయం నుంచి హిందూపురం సబ్ ట్రెజరీ మార్చవలసి బదిలీ చేయవలసిందిగా వినతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment