విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు .. జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్
శ్రీ సత్య సాయి జిల్లా ,మే 2 (ప్రజా అమరావతి); ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి . బసంత్ కుమార్ హెచ్చరించారు. సోమవారం ఉదయం పుట్టపర్తి నియోజకవర్గం లోని బుక్కపట్నం ప్రధాన కేంద్రం లోని బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కలెక్టర్ పరిశీలించారు. పారామెడికల్ సిబ్బంది సేవలు, పోలీసు పర్యవేక్షణ విధులు తదితర అంశాలపై ఆరా తీశారు . పరీక్షలుబాగా రాయండి విద్యార్థులకు తెలిపారు. ఈరోజు మ్యాథమెటిక్స్ పరీక్ష విద్యార్థులు రాశారు. ఈ కేంద్రం నందు 135 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా. కేవలం 133 మంది మాత్రమే పరీక్షలు రాశారు.ఈ సందర్భంగా పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు గుర్తించిన కలెక్టర్ సంబంధిత విద్యుత్ శాఖ వెంకటేష్ నాయక్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు
జిల్లా కలెక్టర్ స్వయంగా బుక్కపట్నం లోని విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి విద్యుత్ సరఫరా పై ఆరా తీశారు . ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులు ఫోను ద్వారా సమస్యను దృష్టికి తెలపడానికి ఫోన్ చేస్తే విద్యుత్ శాఖ అధికారులు స్పందించడం లేదన్న ఫిర్యాదులు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలు, త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు నందు విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో కచ్చితంగా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగింపు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే సమస్య ఉత్పన్నం అయినప్పుడు వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన హెచ్చరించారు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బుక్కపట్నం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం శ్రీమతి సునిత సంబంధిత శాఖ అధికారులు తరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment