సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధనలో ఎపిని మొదటి స్థానంలో నిలపాలి
• వాతావరణ మార్పులకు సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ దోహదం చేస్తాయి
• పిల్లల జీవన ప్రమాణాన్నిమరింత మెరుగుపర్చేందుకు కృషి చేయాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ
అమరావతి,మే 5 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వ ఫ్రాధాన్యత అంశాలకి సంబంధించి సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు వివిధ శాఖలు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ చెప్పారు.సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ మరియు మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్సు అంశాలపై రాష్ట్ర ప్రణాళికాశాఖ,నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో వివిధ శాఖల కార్యదర్శులు,అధికారులతో రెండు రోజుల పాటు జరిగే వర్కు షాపు గురువారం ప్రారంభమైంది.ఈకార్యశాలలో పాల్గొన్నప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ కీలకోపన్యాసం చేశారు.ముందుగా సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ప్రతి ఒక్కరూ పూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పారు.రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ ఇండికేటర్లను పూర్తి స్థాయిలో సాధించేందుకు సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.ముఖ్యంగా వాతావరణ మార్పు లకు ఎస్డిజిలు దోహద పడేలా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు.అదే విధంగా ఎస్డిజి లక్ష్యాల సాధనలో భాగంగా పిల్లలు జీవన విధానాన్నిమరింత మెరుగు పర్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎస్.డా.సమీర్ శర్మ చెప్పారు.అదే విధంగా విద్య,వైద్య రంగాల్లో ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పలు కార్యక్రమాలు,పధకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న నేపధ్యంలో ఆయా ఇండికేటర్లకు సంబంధించిన లక్ష్యాలను పూర్తిగా అధిగమించి దేశంలో మెరుగైన స్ధానాన్ని సాధించేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.
ఈవర్కు షాపులో నీతి ఆయోగ్ సలహాదారు (ఎస్డిజి)సాన్యుక్త సమాద్దార్(Sanyukta Samaddar)పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ ఎస్డిజి ఇండికేటర్ల గురించి వివరించారు. ముఖ్యంగా 115 స్టేట్ ఇండికేటర్లు గురించి వాటి సాధనంలో ఎపి స్ధానం పైన ఆమె చెప్పారు. ఎస్డిజి లక్ష్యాలకు నీతి ఆయోగ్ నోడలు ఏజెన్సీగా ఉందన్నారు.29 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ఎస్డిజిలను నీతి ఆయోగ్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఆయా రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు సాధించిన లక్ష్యాలకు అనుగుణంగా వాటికి ర్యాంకింగ్ లు ఇవ్వడం జరుగు తుందని ఆమె పేర్కొన్నారు.వివిధ ఇండికేటర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని నీతి ఆయోగ్ సలహాదారు సాన్యుక్త సమాద్దార్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాలు ఎస్డిజి విజన్ డాక్యుమెంట్లను రూపొందించాయని ఆమె చెప్పారు.
అనంతరం వివిధ ఇండికేటర్లు వాటిలో ఆంధ్రప్రదేశ్ సాధించిన లక్ష్యాలు,దేశంలో ఎపి స్థానం తదితర అంశాలను నీతి ఆయోగ్ సలహాదారు సాన్యుక్త సమాదార్ వివరించారు.వాటిలో 16 ముఖ్య ఇండికేటర్లు అనగా జీరో పేదరిక నిర్మూలన,జీరో హంగర్,గుడ్ హెల్తు మరియు వెల్ బీయింగ్,క్వాలిటీ ఎడ్యుకేషన్,జెండర్ ఈక్వాలిటీ,క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ వంటి ఇండికేటర్లలో ఎపి సాధించిన లక్ష్యాలను వివరించారు.అదే విధంగా డీసెంట్ వర్కు అండ్ ఎకనామిక్ గ్రోత్,ఇండస్ట్రీ ఇన్నోవేషన్ మరియు ఇన్ప్రాస్ట్రక్చర్,రెడ్యూసింగ్ ఇనీక్వాలిటీస్, సస్టయినబుల్ సిటీస్ మరియు కమ్యునిటీస్,రెస్పాన్సిబుల్ కన్సంప్సన్ మరియు ప్రొడక్షన్, క్లైమేట్ యాక్సన్,లైఫ్ అండ్ ల్యాండ్,పీస్,జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇనిస్టిట్యూషన్ వంటి ఇండికేటర్లలో ఆంధ్రప్రదేశ్ సాధించిన లక్ష్యాలు,జాతీయే స్థాయిలో ఎపి స్థానం తదితర అంశాలపై ఆమె వివరించారు.అనంతరం మల్టీ డైమెన్సనల్ పోవర్టీ ఇండెక్సు(MPI)లక్ష్యాలు వాటిలో దేశంలోను వివిధ సమీప రాష్ట్రాల్లో ఎపి స్థానం తదితర అంశాలను గురించి నీతి ఆయోగ్ సలహాదారు సాన్యుక్త సమాద్దార్ వివరించారు.
ఈ రెండు రోజుల కార్యశాలకు తొలుత రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి జిఎస్ ఆర్కె విజయకుమార్ స్వాగతం పలుకగా కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు జయలక్ష్మి,ఎఆర్ అనురాధ,వాణి మోహన్ తోపాటు ప్రవీణ్ కుమార్, సురేశ్ కుమార్,గిరిజా శంకర్,కోన.శశిధర్,కె.భాస్కర్,మురళీధర్ రెడ్డి తదితర కార్యదర్శులు, శాఖాధిపతులు,ముఖ్య ప్రణాళికా అధికారులు,నోడలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment