కొవ్వూరు(కాపవరం) (ప్రజా అమరావతి);
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మూడు సంవత్సరాల కాలంలో ప్రయోజనం చేకూర్చిన వివరాలు లేఖలు అందిస్తూ లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
బుధవారం రాత్రి పొద్దపోయేదాకా కొవ్వూరు మండలం కాపవరం గ్రామం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ప్రతి గడపలో ప్రభుత్వం ద్వారా ఒకటి నుంచి ఇద్దరు, ముగ్గురు కూడా జగనన్న ప్రభుత్వం అందచేసిన ప్రయోజనం పొందిన వారు ఉన్నారనడంలో సందేహం లేదన్నారు. గడపగడపకు వెళుతున్న మాకు ప్రభుత్వం వారికి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరాలు తెలియజేస్తూ , పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారన్నారు. మహిళలు మమ్మల్ని ఆశ్చర్య పరిచేలా వాళ్ల మాటలు ఉన్నాయన్నారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించడం పట్ల ప్రజలు జగనన్న పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజల కోసం గొప్పగా ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని అనడం చూశామన్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను... అనే మాటలు నిజం చేస్తూ హామీలు అమలు చేస్తూ అండగా భరోసాగా ఉన్నారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల కోసం ఎవరి వద్దకు వెళ్లలేదని, అర్హులను గుర్తించే క్రమంలో వాలంటీర్లు ఇంటికి వచ్చి పథకాలను వర్తింపజేస్తున్నారు అని పేర్కొన్నారు ప్రభుత్వానికి జగనన్నకు కృతజ్ఞతలు వ్యక్తం చేసారు.
జడ్పీ వైస్ చైర్మన్ పి. శ్రీలేఖ, జెడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మీ, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు సుంకర సత్యనారాయణ, కాపవరం
సర్పంచ్, సుంకర పద్మిని, తది తరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment