**గ్రామ,వార్డు సచివాలయ సేవలతో పరిపాలనలో నూతన వరవడి
**
**రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాష**
**వాలంటీర్ల ఉత్తమ ప్రతిభకు పురస్కారాలు**
కడప , మే 10 (ప్రజా అమరావతి): గ్రామ,వార్డు సచివాలయ సేవలతో ప్రభుత్వ పరిపాలనలో నూతన వరవడి సృష్టించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాష అన్నారు.
మంగళవారం స్థానిక కాగితాలపెంట లోని కింగ్ ప్యాలస్ హాలు నందు 40,41,42,43,44,45,46,47,48 వార్డు లకు సంబంధించి సచివాలయ వార్డు వాలంటీర్ల సేవా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాష,నగర మేయర్ సురేష్ బాబు లు హాజరయ్యారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాష మాట్లాడుతూ...దేశంలో ఎక్కడా లేని విదంగా గ్రామ ,వార్డు సచివాలయ వ్యవస్థను మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా స్థాపించడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.ప్రభుత్వ పథకాలు ప్రజల గడపకు చేరుస్తున్న మానవతా మూర్తులు వాలంటీర్లని కొనియాడారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ,కుల, మత,పార్టీ లకతీతంగా అవినీతి, వివక్షత లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రతి నెల 1 వతేది తెల్లవారక మునుపే తలుపు తట్టి అవ్వాతాతలకు పించలను అందజేస్తున్నారన్నారు. కోవిడ్ సమయంలో
వాలంటీర్లు సైనికుల్లా పనిచేసి మెరుగైన సేవలందించారన్నారు. రాబోయే రోజులలో వాలంటీర్లు బాగా పనిచేసి రాష్ట్రా నికి మంచి పేరు తీసుకురావాలన్నారు.ప్రతిభ చూపిన వాలంటీర్లను గుర్తించిన ప్రభుత్వం సేవా మిత్ర, సేవ రత్న, సేవా వజ్ర పేర్లతో సత్కరిస్తోందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విదంగా వివిధ సంక్షేమ పథకాలకు సంబందించి ఒక్క బటన్ నొక్కి అర్హత కలిగిన లక్ష ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను లబ్ది దారులందరికీ అకౌంట్ లలో జమ చేశారన్నారు.అలాగే గత ప్రభుత్వం డ్వాక్రా మహిళల, నిరుద్యోగుల విషయంలో మాటతప్పిందన్నారు.మన ప్రభుత్వం డ్వాక్రా రుణాలకు ఆర్ధిక చేయూత నిచ్చి, లక్ష ల మంది నిరుద్యోగులకు ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ప్రభుత్వ భూములలో పాటు,కోట్ల రూపాయల విలువ గల ఫ్రైవేటు భూములను సైతం కొని పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడం లో అర్హులైన 31 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత మన ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి వాలంటిర్ల మీద పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేయకుండా మరింత కష్టించి పని చేయాలని కోరారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా వివరించాలన్నారు. వై యస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కలకాలం వుంటే రాష్ట్రంలో పేదరికమే ఉండదన్నారు.
నగర మేయర్ కే సురేష్ బాబు మాట్లాడుతూ...గత ప్రభుత్వంలో ఇచ్చిన హామిలను నెరవేర్చలేదన్నారు. . వై.యస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నాటి నుండి పేద ప్రజల అభ్యున్నతికి నవ రత్నాల రూపంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని వాటిని సచివాలయ గ్రామ వార్డు వాలంటీర్ ల ద్వారా అందజేయడం జరుగుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని రకాల సేవలు, సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని అన్నారు.మన సచివాలయ వ్యవస్థ మిగతా రాష్ట్రాలకు ఆదర్శం అన్నారు. ప్రభుత్వం గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు
ఈ సందర్భంగా ప్రజలకు సేవలందించడంలో ప్రతిభ చూపిన 40,41,42,43,44,45,46,47 48 వార్డు లకు సంబంధించి 245 మంది వాలంటీర్లను అభినందిస్తూ నలుగురికి సేవా రత్న,మిగిలిన 241 మందికి సేవా మిత్ర పురస్కారాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాష అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రమణారెడ్డి, అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, కార్పోరేటర్లు బాలస్వామి రెడ్డి,పాక సురేష్ ,ఆనంద్ బాబు,ఇంఛార్జి లు రామకృష్ణా రెడ్డి, చల్లా రాజశేఖర్, రెడ్డి ప్రసాద్,జమాల్ వల్లి,రామచంద్రా రెడ్డి,శ్రీనివాసుల రెడ్డి వైఎస్సార్సీపి నాయకులు జగదీష్ ,గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment