మనసు పెట్టి స్పందన గ్రీవెన్స్ లకు పరిష్కారం చూపించాలి*
*: ఇప్పుడు వచ్చిన అర్జీలు మళ్లీ రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలి*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
*: ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్*
*ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా), మే 28 (ప్రజా అమరావతి):
స్పందన గ్రీవెన్స్ అర్జీలకు మనసు పెట్టి పరిష్కారం చూపించాలని, ఇప్పుడు వచ్చిన అర్జీలు మళ్లీ రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈరోజు స్పందన కార్యక్రమంలో 105 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ఆర్డీఓ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్ పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ధర్మవరంలో స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు మంచి చర్య అని, సుదూర ప్రాంతాల నుంచి పుట్టపర్తికి వచ్చి అర్జీ ఇచ్చినా పరిష్కరించాల్సిన బాధ్యత స్థానిక అధికారులదేనన్నారు. ప్రజల అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కరం ఇవ్వడం జరుగుతుందన్నారు. స్పందన గ్రీవెన్స్ అర్జీల్లో ఎక్కువగా రెవెన్యూకు సంబంధించి 90 శాతం అర్జీలను స్వీకరించడం జరిగిందని, ధర్మవరం మండలం లో 43, ముదిగుబ్బలో 24, C.K.పల్లి 15, కనగానపల్లి 10, తాడిమర్రి 7, రామగిరి 3, బత్తలపల్లి 3 , ఈరోజు స్పందనలో వచ్చిన అర్జీలను 105 అర్జీలను స్వీకరించడం జరిగింది తెలిపారు
వాటికి రాబోయే 15 రోజుల్లో ఆర్డీఓతో మాట్లాడి మళ్ళీ రాకుండా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని, అర్జీలకు నాణ్యమైన పరిష్కారం విషయమై చర్చించాలని, నాణ్యతగా పరిష్కారం చూపించాలన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను నమ్మేలా పరిష్కారం ఉండాలని, ప్రతి అర్జీలను మనసు పెట్టి పరిష్కరించాలన్నారు. స్పందన గ్రీవెన్స్ పరిష్కారానికి అందరూ మనస్ఫూర్తిగా పనిచేయాలని సూచించారు. ప్రజల నుంచి అర్జీల స్వీకారం బాగా జరిగిందని, జిల్లాకు మంచిపేరు తీసుకువచ్చేలా అందరూ పని చేయాలని ఆదేశించారు. స్పందన గ్రీవెన్స్ అర్జీలను 100 శాతం 30 రోజుల్లో పరిష్కరించాలనన్నారు. స్పందన పిటిషన్ లు అర్జీదారుడితో కాంటాక్ట్ అయి తహసీల్దార్ లు నాణ్యతగా అర్జీలను పరిష్కరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు వచ్చిన అర్జీలు రీ ఓపెన్ కాకూడదన్నారు. 100 శాతం ఎంక్వరి చేయాలని, భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని వ్యక్తిగతంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్పందన తహసీల్దార్ అనుపమ, తహసీల్దార్ లు నీలకంఠారెడ్డి, ఖతిజన్ కుఫ్రా, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి, ఎంపిడిఓ భాస్కర్ రావు, సిడిపిఓ వరలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment