కలెక్టరేట్, ఇతర కార్యాలయ భవనాలు కోసం స్థల పరిశీలన ... కలెక్టర్
రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి) : 


కలెక్టరేట్, ఇతర కార్యాలయ భవనాలు కోసం స్థల పరిశీలన ... కలెక్టర్ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఇతర భవనాలు, కార్యాలయాలు ఏర్పాటు కు సంబంధించిన తొలి సారిగా క్షేత్ర స్థాయిలో పర్యటించడం జరిగిందని జిల్లా కలెక్టర్  డా. కె. మాధవీలత తెలిపారు.


శనివారం రాజమహేంద్రవరం రూరల్, అర్బన్ లోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించి, స్థలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, నూతనంగా తూర్పు గోదావరి జిల్లా ఏర్పాటు చేసిన తరువాత బొమ్మురు లోని న్యాక్ భవన సముదాయంలో  తాత్కాలికంగా కలెక్టరేట్ ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన స్థలం కోసం పరిశీలించి నట్లు తెలిపారు. కలెక్టరేట్,  , ఇతర ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఉండేలా, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయాలు , ఇతర అధికారుల భవనాలు ఏర్పాటు కోసం స్థల పరిశీలన చెయ్యడం జరుగుతోందన్నారు. 


నగరంలో, రూరల్ లో పలు ప్రాంతాల్లో పర్యటించి ఆర్ అండ్ బి కార్యాలయం ప్రాంతం, సిటీ ఆర్ ఐ, జే ఎన్ రోడ్, ధవళేశ్వరం ప్రాంతంలోను , ప్రస్తుత కలెక్టరేట్ ఉన్న ప్రాంతంలో ను ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు.  ఆయా ప్రాంతాల్లో ఎంత విస్తీర్ణంలో భూములు అందుబాటులో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.


ఈ పర్యటనకు కలెక్టర్ వెంట ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, తహశీల్దార్ రియాజ్ హుస్సేన్,  సర్వేయర్ శ్రీనివాస రెడ్డి,  ఆర్ ఐ సాగర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. Comments