సమాజ అభివృద్ధి కోసం, మాతృభూమి గొప్ప శ్రేయస్సు కోసం నేటి యువత ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా ప్రవర్తించాలి

 

నెల్లూరు, (ప్రజా అమరావతి);



సమాజ అభివృద్ధి కోసం,  మాతృభూమి గొప్ప శ్రేయస్సు కోసం నేటి యువత  ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా ప్రవర్తించాల


ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఉద్భోదించారు. 


మంగళవారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన 6వ, 7వ స్నాతకోత్సవ  కార్యక్రమంలో వర్సిటీ చాన్సెలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ శ్రీ  బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శ్రీ  బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ, ఈరోజు డిగ్రీలు అందుకున్న గ్రాడ్యుయేట్‌లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్ స్కాలర్‌లు మరియు గోల్డ్ మెడల్ అవార్డు గ్రహీత లందరికి  నేను అభినందనలు తెలుపుతూ,  నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నానన్నారు. మీ విజయానికి సహకరించిన మీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు మీ శ్రేయోభిలాషులందరికీ ఇది చిరస్మరణీయమైన సంఘటన మరియు మీకు గర్వకారణమని,  జీవితాంతం మంచి నడవడికతో మెలగాలన్నారు. పెద్దగా కలలు కనాలని, ఆ కలలు నిజం చేసేందుకు శ్రమించాలన్నారు. మీరు టార్చ్ బేరర్ గా వుంటూ నేటి యువతరానికి ఆదర్శప్రాయులుగా  నిలవాలన్నారు. మానవత్వంతో మెలగడానికి మనసారా ప్రాధమిక విలువలు విధిగా పాటించాలన్నారు.  సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు  సమాజాభివృద్దిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ శ్రీ  బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థి యొక్క విద్యా ప్రయాణంలో కాన్వకేషన్ ఒక ముఖ్యమైన మైలురాయని,  ఇది గ్రాడ్యుయేటింగ్ విద్యార్థి బాధ్యతాయుతమైన పౌరుడిగా రూపాంతరం చెందడానికి ఒక సందర్భాన్ని సూచిస్తుందన్నారు. అతని వృత్తిపరమైన నైపుణ్యాలు ఇక్కడ సంపాదించిన విలువలతో పాటు వాస్తవ ప్రపంచ వాతావరణంలో పరీక్షించబడతాయన్నారు.  అదే సమయంలో బోధన మరియు అభ్యాసం  రెండూ భవిష్యత్తు కోసం కొత్త లక్ష్యాలు మరియు ప్రమాణాలను ప్రతిబింబించడానికి  ఇది ఒక సందర్భమని, ఎంచుకున్న రంగం ఏదైనా  సమాజంలో అట్టడుగున ఉన్నవారికి సమన్యాయం చేయాలని రాష్ట్ర గవర్నర్ విద్యార్థులకు సూచించారు. ఈ రోజు మీరు అందుకున్న డిగ్రీ ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి మరియు  ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి  మీకు విశ్వాసాన్ని ఇస్తుందని  రాష్ట్ర గవర్నర్ అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి దేశ విదేశాలకి వెళ్తారని,  ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని మర్చిపోవద్దని,  సామాజిక బాధ్యతని తప్పకుండా పాటించాలని రాష్ట్ర గవర్నర్,  విద్యార్థులకు సూచనలు చేశారు.  యూనివర్శిటీ లో పొందే డిగ్రీ  దేశ శ్రేయస్సు కోసం,  సమాజంలోని అట్టడుగున వున్న  పేద వర్గాల ప్రజలకు, సేవ చేయడానికి వినియోగించినప్పుడే మీరు పొందిన డిగ్రీ కి సార్ధకత చేకూరుతుందని  రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. 


భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన జాతీయ విద్యా విధానం-2020,  వచ్చే 2035 నాటికి స్థూల నమోదు నిష్పత్తిని 50% కి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. దేశంలో   810  విశ్వవిద్యాలయాలు,  40 వేల కళాశాలు కొత్త విద్యా విధానం ద్వారా  విద్యార్థులకు  విద్యను అందిస్తుందన్నారు.విద్య యొక్క బహుళ క్రమశిక్షణా స్వభావం, ప్రపంచీకరణ, సహకారాలు జాతీయ విద్యా విధానం-2020 ముఖ్యమైన లక్షణాలన్నారు.  దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు  జాతీయ విద్యా విధానం-2020 కి అనుగుణంగా అన్ని ప్రోగ్రామ్‌ల పాఠ్యాంశాలను విజయవంతంగా సవరించిందన్నారు. దేశంలో   2025 నాటికి  కోటి 20 లక్షల మంది  నైపుణ్యం గల యువత అవసరమని దానికి అనుగుణంగా    నైపుణ్యం గల యువతను తీర్చిదిద్దేలా  విద్యా ప్రమాణాలను  అందించాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై వుందని రాష్ట్ర గవర్నర్  సూచించారు.  యువతలో  నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం  ప్రధాన మంత్రి  కౌశల్ వికాస్ యోజన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని,  రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని  ప్రారంబించడం జరిగిందని  రాష్ట్ర గవర్నర్ వివరించారు. 


నేటి కార్యక్రమానికి అతిథిగా హాజరైన మల్లారెడ్డి విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య  డి.ఎన్. రెడ్డి,  శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్  శ్రీ రవీంద్ర సన్నారెడ్డి   ఇచ్చిన  విలువైన సందేశం విద్యార్దుల జీవితంలో విజయం సాధించేందుకు ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని రాష్ట్ర గవర్నర్ అభిప్రాయపడ్డారు.  విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అభివృద్దికి, నాణ్యమైన విద్యను అందించడంలో  కృషి చేసిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ G.M. సుందరవల్లి మరియు సిబ్బందిని  అభినందిస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ శ్రీ  బిశ్వభూషణ్ హరిచందన్  తెలిపారు. 


ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య  డి.ఎన్. రెడ్డి,    శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్  శ్రీ రవీంద్ర సన్నారెడ్డి   ముఖ్య అతిధులుగా పాల్గొని  ప్రసంగిస్తూ,  నేడు ప్రపంచీకరణలో భాగంగా మారుతున్న  సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నీటి యువత తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం వుందన్నారు. 

తొలుత వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ G.M. సుందరవల్లి, విక్రమ సింహపురి 


విశ్వవిద్యాలయం పరిధిలో చేపడుతున్న విద్యా కార్యక్రమాలను వివరించారు.


అంతకు ముందు  గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ స్కాలర్స్ గా పట్టాలు పొంది  బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు  రాష్ట్ర  గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, పట్టాలతోపాటు బంగారు పతకాలను అందచేశారు. ఈ రోజు జరిగిన కాన్వకేషన్ కార్యక్రమంలో   గౌరవ డాక్టరేట్ ను  మేనేజింగ్ డైరెక్టర్  శ్రీ రవీంద్ర సన్నారెడ్డి ,   రాష్ట్ర గవర్నర్ శ్రీ  బిశ్వభూషణ్ హరిచందన్   గారి చేతుల మీదుగా పట్టా పొందారు. 


ఈ కార్యక్రమంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. ఎల్.  విజయ కృష్ణారెడ్డి, రాష్ట్ర గవర్నర్ గారి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ ఆర్.పి. సిసోడియా, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు,  కమ్యునిటి డవలప్మెంట్ ఛైర్మన్ శ్రీ నేదురమల్లి రాంకుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీ హరేందిర ప్రసాద్, నెల్లూరు నగర కార్పోరేషన్ కమీషనర్ కుమారి జాహ్నవి,  వివిధ శాఖల అధికారులు, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వివిధ విభాగాలకు చెందిన, డీన్ లు  అధ్యాపకులు,  డిగ్రీలు అందుకుంటున్న  గ్రాడ్యుయేట్‌లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్ స్కాలర్‌లు తదితరులు పాల్గొన్నారు. 

Comments