కోదండ రామాలయాన్ని దర్శించుకున్న.. ఆకాంక్ష జిల్లాల ప్రాబరీ అధికారి పీయూష్ కుమార్

 


*కోదండ రామాలయాన్ని దర్శించుకున్న.. ఆకాంక్ష జిల్లాల ప్రాబరీ అధికారి పీయూష్ కుమార్


*


కడప, మే 1 (ప్రజా అమరావతి): భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి, కేంద్ర ప్రాబరీ అధికారి పీయూష్ కుమార్.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జేసీ సాయికాంత్ వర్మతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని సందర్శించారు. 


జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం కడపకు విచ్చేసిన కేంద్ర ప్రాబరీ అధికారి పీయూష్ కుమార్.. ఆదివారం ఉదయం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని సందర్శించి… ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అర్చన చేసి పూజలు చేసిన అనంతరం.. వారిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం కోదండరామాలయ చారిత్రక వైభవాన్ని వివరించారు. 


ఈ కార్యక్రమంలో తితిదే అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Comments